జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుతోందా.. ఆ స‌ర్వేలో పోయినేడాది కంటే ఈ సారి ర్యాంకు త‌గ్గిందే

ఏపీలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.వై.

 Is The Popularity Of Jagan Declining? This Time The Rank Is Lower Than What Was-TeluguStop.com

ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుంచి ఇప్పుడున్న జ‌గ‌న్ వ‌ర‌కు వారి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా విప‌రీత‌మైన అభిమాన ద‌ళాలు ఉన్నాయనే చెప్పాలి.

రాజ‌కీయంగా ఎంద‌రికో భ‌విష్య‌త్తును ఇచ్చిన ఫ్యామిలీ జ‌గ‌న్‌ది.అందుకే ఆయ‌న పార్టీ పెట్ట‌గానే ఎంద‌రో ప్ర‌ముఖులు ఆయా పార్టీల‌ను వీడి మ‌రీ వైసీపీలో జాయిన్ అయ్యారు.ఇక ఏపీలో జ‌నాద‌ర‌ణ కూడా కేవ‌లం వై.ఎస్‌.ఆర్ పేరు చెబితేనే జ‌గ‌న్‌కు అధికారం క‌ట్ట‌బెట్టేంత‌గా చూపించేశారు.దీంతో జ‌గ‌న్‌కు ఇక తిరుగే ఉండ‌ద‌ని అంతా అనుకున్నారు.

ఇంకో రెండు లేదా మూడు ట‌ర్మ్‌ల వ‌ర‌కు కూడా ఏపీలో జ‌గ‌న్ పాల‌నే న‌డుస్తుంద‌ని అంతా అనుకున్నారు.ఇందుకు త‌గ్గ‌ట్టే పోయినేడాది ఆయ‌న మీద నిర్వ‌హించిన ప్ర‌తి స‌ర్వేలో కూడా దేశంలోనే అత్యంత ప్ర‌జాధ‌ర‌న క‌లిగిన సీఎంల‌లో ఆయ‌న టాప్ 10లో చోటు ద‌క్కించుకున్నారు.

అయితే ఈ ఏడాది కూడా జగన్ పాలనకు సంబం ధించి ప్రముఖ పత్రిక ఇండియా టుడే నిర్వ‌హించిన ది మూడ్ ఆఫ్ దినేషన్ సర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.ఈ స‌ర్వేను ఇప్పుడున్న దేశంలోని అంద‌రు సీఎంల‌పై నిర్వ‌హించారు.

Telugu Ap Poltics, Cms List, India Sevey, Jagan, Jagan Top, Popularity Cms-Telug

కాగా ఇందులో ముఖ్యమంత్రుల పనితీరుపై స‌ర్వే చేయ‌గా జగన్‌కు భారీగా ప్రజాదరణ తగ్గిపోయిన విషయం వెల్లడైంది.టాప్ 10లో ఉన్న సీఎంల లిస్టును ప్ర‌క‌టించ‌గా ఇందులో ఏపీ సీఎం జగన్ పేరు లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది.ఎందుకంటే పోయినేడాది ఇదే లిస్టులో జగన్ ఏకంగా నాలుగో ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే ఈ సారి మాత్రం 11 శాతం ప్రజాదరణ తగ్గిపోయి లిస్టులో పేరు ద‌క్కించుకోలేక‌పోయారు.

ఇక ఇటు కేసీఆర్‌కు కూడా ఈ లిస్టులో పేరు ద‌క్క‌లేదు.అంటే క్ర‌మ క్ర‌మంగా వైసీపీపై ప్ర‌జాధ‌ర‌ణ త‌గ్గుతోంద‌ని వెల్ల‌డ‌వుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube