వేటినీ ప‌ట్టించుకోని ష‌ర్మిల‌.. కేవ‌లం దానిమీదే ఆధార‌ప‌డుతోందేంటి?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు వైఎస్‌.ష‌ర్మిల‌.

 Sharmila Who Does Not Care About Anything What Is The Basis Of It Only, Sharmila-TeluguStop.com

అయితే ఆమె ఎంట్రీని చూసి త‌ల‌లు పండిన మేథావులు సైతం షాక్ అయ్యార‌నే చెప్పాలి.ఎందుకంటే ఆమె ప్ర‌య‌త్నం చూస్తుంటే ఎడారిలో కొబ్బ‌రిబోండం కోసం వెతికిన‌ట్టే అనిపించింది.

ఆమె మీద ఆంధ్రా ముద్ర ఉన్నంత వ‌ర‌కు ఆమెను తెలంగాణ ప్ర‌జ‌లు ఆక్సెప్ట్ చేయ‌ర‌నేది అంద‌రికీ తెలిసిందే.అయితే ఆమె మాత్రం తాను తెలంగాణ మ‌హిళ‌నే అంటూ నిరూపించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక ఇందులో భాగంగా బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారే చెప్పాలి.కాగా ఆమెను మాత్రం ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే అనిపిస్తోంది.అయితే ఆమె ఎంట్రీఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఒకే అంశంపై ఆధార‌ప‌డుతున్నారు.అదే నిరుద్యోగ స‌మ‌స్య‌.

ఆమె ప్ర‌ధాన ఎజెండాగా నిరుద్యోగాన్ని ఎంచుకోవ‌డం అందుకోసం ఏకంగా దీక్ష‌లు, నిర‌స‌న‌లు కూడా చేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది.కాగా ఆమె రాష్ట్రంలో జ‌రుగుతు్న పరిణామాలపై పెద్ద‌గా స్పందించ‌కుండా కేవలం నిరుద్యోగం.

ఉద్యోగాల భర్తీ మీదనే ఫోక‌స్ చేస్తూ ఆందోళనలు నిరసనలు చేయ‌డం చూస్తేనే ఉన్నాం.

Telugu Huzurabad, Sharmila, Ts, Ys Sharmila-Telugu Political News

అయితే ఈ విధంగా ఆమె చేస్తున్న నిర‌స‌న సభలకు మొద‌ట్లో మీడియాత పాటు కొంత యూత్‌లోనూ మంచి ఆద‌ర‌ణే లభించేది.కానీ ఆ త‌ర్వాత కాలంలో ఈ ఇరువురి నుంచి ఆమెకు ఆద‌ర‌ణ క‌రువైంద‌నే చెప్పాలి.ఇక ష‌ర్మిల మాత్రం ఇత‌ర స‌మ‌స్య‌లు చాలానే ఉన్నా కూడా వాటిపై పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌కుండా కేవ‌లం నిరుద్యోగా ఎజెండాతో ముందుకు వెళ్ల‌డంతో మిగ‌తా వ‌ర్గాల వారెవ‌రూ కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌ట్లేదు.

ఇక రాష్ట్రంలో జ‌రుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక చుట్టూ తిరుతున్నా కూడా ఆమె మాత్రం దానిలో పోటీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేసేసింది.ఇలా వేటినీ ప‌ట్టించుకోకుండా ముందుకెళ్తే భ‌విష్య‌త్తులో కూడా ఉన్న ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంద‌నే చెప్తున్నారు విశ్లేష‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube