పుష్ప 2 లో కొనసాగనున్న సామ్.. సుక్కూ ఆలోచన మాములుగా లేదుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఇక పార్ట్ 2 గా తెరకెక్కనున్న ‘పుష్ప ది రూల్’ కోసం ఎదురు చూడని సినీ ప్రేక్షకుడు లేడు.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.

 Is Sukumar Planning Samantha In Pushpa 2 Details, Allu Arjun , Pushpa 2 , Direct-TeluguStop.com

350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.అయితే ఇది ఒక్క పార్ట్ తో పూర్తి అవ్వలేదు.దీంతో సుకుమార్ ఈ సినిమాను మరొక పార్ట్ కూడా తీస్తున్నట్టు తెలిపాడు.పుష్ప ది రూల్ పేరుతొ ఈ సినిమా తెరకెక్కుతుంది.

సుకుమార్ గత ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు.మరి ఇప్పటికి సుకుమార్ స్టోరీలో కీలక మార్పులు కూడా చేసినట్టు బౌండ్ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు అల్లు అర్జున్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

ఈ క్రమంలోనే మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu Allu Arjun, Sukumar, Pushaprule, Pushpa, Samantha, Samantha Pushpa-Movie

పార్ట్ 1 లో ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమంత రెండవ పార్ట్ లో కూడా కొనసాగుతుందని టాక్ వస్తుంది.

పార్ట్ 1 లో ఉన్న వారిలో కొన్ని పాత్రలు కొనసాగుతాయి.అలాగే ఇప్పుడు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మరికొన్ని కొత్త పాత్రలను కూడా సుకుమార్ తీసుకురాబోతున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న వార్త ప్రకారం.సమంత పార్ట్ 2 లో పుష్పరాజ్ కు సహాయం చేసే స్నేహితురాలి పాత్రలో కొనసాగించాలని సుక్కు భావిస్తున్నాడట.

మరి స్క్రిప్ట్ లో సుకుమార్ చేసిన మార్పులు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube