Nithya Menon : ఆయన టార్చర్ భరించలేకే నిత్య మీనన్ పెళ్లి కి దూరంగా ఉందా.. షాకింగ్ సీక్రెట్..!!

చాలామంది హీరోయిన్లకు కేవలం మామూలు జనాల్లోనే అభిమానులు ఉంటారు.కానీ ఈ హీరోయిన్ కి మాత్రం హీరో హీరోయిన్లలో కూడా అభిమానులు ఉంటారు.

ఇక ఆమె ఎవరో కాదు మలయాళ కుట్టి నిత్యమీనన్( Nithya Menon ) .నిత్యామీనన్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి స్టార్డం సంపాదించింది.అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.అయితే ఇప్పటికే చాలా సార్లు నిత్యామీనన్ పెళ్లి వార్తలు మీడియాలో వినిపించినప్పటికీ అది నిజం కాలేదు.

అయితే తాజాగా తమిళ సినీ విమర్శకుడు బయిల్వాన్ రంగనాథన్ ( Bayilvan Ranganathan ) నిత్యామీనన్ పెళ్లిపై ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం బయట పెట్టారు ఆయన.

Telugu Gossips, Nithya Menon, Srimathi Web-Latest News - Telugu

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నిత్య మీనన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ ఫేమస్ మలయాళ నటి పెళ్లయ్యాక అత్తింటి వాళ్ళు వరకట్నం ఎక్కువ తీసుకురావాలని టార్చర్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.అయితే ఆ నటి ఆత్మహత్య చేసుకోవడం చూశాక నిత్యమీనన్ తాను పెళ్లి చేసుకుంటే కూడా అలాంటి ఇబ్బందులే వస్తాయి అనే భయంతో ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉంటుంది.

అంతేకాదు నిత్యామీనన్ బరువు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కూడా పెళ్లికి దూరంగా ఉంటుంది అంటూ నిత్యామీనన్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం సినీ నటుడు విమర్శకుడైన బయిల్వాన్ రంగనాథన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నిత్యమీనన్ పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఆయన చెప్పింది నిజమేనా అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.మరి ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అనే దానిపై నిత్యామీనన్ స్పందిస్తే గాని ఎవరికి తెలియదు.

ఇక నిత్య మీనన్ ఈ మధ్యనే శ్రీమతి ( Srimathi ) అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube