భారతీయులకు మెరుగైన ఆన్‌లైన్ భద్రతే లక్ష్యంగా... డిజి కవచ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన గూగుల్..

తాజాగా గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్( Google for India 2023 ) ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగింది.ఇక్కడ గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు త్వరలోనే లాంచ్ చేయనున్న వివిధ ప్రోగ్రామ్స్ గురించి మీడియాతో పంచుకున్నారు.

 The Aim Of Better Online Security For Indian Google Announced The Digi Kavach-TeluguStop.com

ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి వినియోగదారులను రక్షించడానికి డిజి కవచ్( Digi Kavach ) అనే కొత్త ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించారు.

డిజి కవచ్ అనేది భారతదేశంలో పైలట్ ప్రాజెక్ట్, ఇది ఆర్థిక మోసాలను గుర్తించి నిరోధించడానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది.తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ ప్రోగ్రామ్‌ అమలులోకి వస్తుంది.ఆసియా పసిఫిక్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సైకత్ మిత్రా మాట్లాడుతూ, భారతదేశంలోని 100 కోట్ల మంది ప్రజలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి డిజి కవచ్ క్రియేట్ చేశామన్నారు.

ఈ కార్యక్రమం స్కామర్ల పద్ధతులను ట్రాక్ చేయడమే కాకుండా, వారి చర్యలు, ఉద్దేశాలను కూడా అంచనా వేస్తుందని ఆయన అన్నారు.

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను నియంత్రించే ప్రభుత్వ సంస్థలైన ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐలతో గూగుల్ సన్నిహితంగా పనిచేస్తోందని మిత్రా చెప్పారు.స్కామ్‌ల నుంచి పౌరులను, వినియోగదారులను రక్షించడం గూగుల్, ఆర్‌బీఐ( RBI ) ఒకే లక్ష్యం అని ఆయన అన్నారు.డిజి కవచ్ ఇప్పటికే గూగుల్ పేలో రూ.12 వేల కోట్లు మోసాలను అరికట్టిందని తెలిపారు.డిజి కవచ్ ప్రారంభ తేదీ ఇంకా తెలియలేదు, అయితే ఇది భారతదేశంలో త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

వచ్చిన తర్వాత మోసాల బారిన పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube