అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తే అక్రమ కేసులా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.ధరణికోటకు చెందిన దండా నాగేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు పాటించకపోవడంతోనే ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించిందని అచ్చెన్నాయుడు తెలిపారు.ఈ జరిమానాను ప్రభుత్వ సొమ్ముతో చెల్లిస్తారా లేక వైసీపీ నేతలు దోచుకున్న డబ్బుతో చెల్లిస్తారా అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.ఇకనైనా వైసీపీ తీరు మారకపోతే ప్రజలే ఇసుక డంపుల్లో వైసీపీని పాతి పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.