సీనియర్ నేతల అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమవుతోందా?

తెలంగాణలో అత్యధిక ప్రజాపాలన చేసిన అనుభవం కాంగ్రెస్ పార్టీకి సొంతం.వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణం తరువాత తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రమవడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇలా గొప్ప గొప్ప ఘట్టాలు జరిగి చరిత్రలో నిలిచిపోయాయి.

 Is Congress Supremacy Failing To Utilize The Experience Of Senior Leader Congres-TeluguStop.com

అయితే ఆ తరువాత సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం అంచనాలు తప్పాయి.కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం చేస్తానని చెప్పి మాట తప్పడం, ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడంలో విఫలమవడం, తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించడం, రెండో దఫా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిపోతోంది.

ప్రజా సమస్యలపై పోరాడటంలో విఫలమవటం, నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి ఇలా చాలా రకాల సమస్యలు కాంగ్రెస్ ను ప్రజల్లో పలుచన అయ్యేలా చేసింది.కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడేయడానికి చాలా మంది కాంగ్రెస్ నేతల సేవలను వినియోగించుకోవచ్చు.

రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలను ప్రయోగించి ప్రజల మద్దతు పొందేలా ప్రయత్నం చేయవచ్చు.కాని కాంగ్రెస్ అధిష్టానం వారి సేవల్ని వినియోగించుకోవడంలో విఫలమవుతూ వస్తోంది.అనుభవాన్ని వినియోగించుకోని ఏ పార్టీ ప్రజల్లో చాలా కాలం నిలువలేదనే చెప్పాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube