గతం లో టీడీపీ( TDP ) పార్టీ లో ముఖ్య నేతలుగా కొనసాగిన ఎంతో మంది ప్రముఖ నాయకులూ సరిగ్గా 2019 ఎన్నికల సమయం లో ఒకరి తర్వాత ఒకరు వైసీపీ పార్టీ లో చేరారు.వారిలో ముఖ్య నాయకులూ అవంతి శ్రీనివాస్( Avanti Srinivas ) కూడా ఒకడు.
ఈయన తెలుగు దేశం పార్టీ తరుపున 2014 ఎన్నికలలో గెలిచి గెలుపొందాడు.పార్టీ లో కీలక పదవులు చేపట్టాడు.కానీ 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుంది, జగన్ వేవ్ ఒక రేంజ్ లో ఉంది అని అర్థం చేసుకొని వైసీపీ లో జాయిన్ అవుతాడు.2019 ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం( Bhimili Constituency ) నుండి పోటీ చేసి గెలుపొందాడు.టీడీపీ లో ఉన్నప్పుడు వైసీపీ మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేసేవాడో, వైసీపీ లోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ పై అలాగే నెగటివ్ కామెంట్స్ చేసాడు.కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీ లోకి రాబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ( YCP )పార్టీ పై ప్రతికూల వాతావరణం నెలకొంది.జనాల్లో పార్టీ మీద తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది.అందరూ టీడీపీ – జనసేన కూటమి వైపు చూడడం మొదలు పెట్టడం తో అవంతి శ్రీనివాస్ టీడీపీ లోకి వచ్చేందుకు ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్.ముందుగా అవంతి శ్రీనివాస్ చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నాడు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనసేన లో చేరడానికి అవంతి శ్రీనివాస్ సిద్ధం గా ఉన్నాడు.కానీ పొత్తు ఉంటుంది , మీరు టీడీపీ నుండి పోటీ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి , కొన్ని రోజులు లాగండి అంటూ పవన్ కళ్యాణ్ ఆపాడట.
అందుకే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ టీడీపీ పార్టీ లో చేరబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.దీని గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.

ఒకవేళ అవంతి శ్రీనివాస్ టీడీపీ లోకి చేరితే ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మరికొంత మంది ముఖ్య నేతలు కూడా టీడీపీ – జనసేన కూటమి లో చేరడానికి సిద్ధం గా ఉన్నారు.ఇప్పటికే వైసీపీ వైజాగ్ ఇంచార్జ్ పంచకర్ల రమేష్ ( Panchkarla Ramesh )జనసేన పార్టీ లో చేరి వైసీపీ కి ఝలక్ ఇచ్చాడు.ఇలాంటి షాక్ లు రాబొయ్యే రోజుల్లో వైసీపీ కి ఇంకా తగలబోతున్నాయని టాక్.ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ని ఉత్తరాంధ్ర లో పూర్తి స్థాయి ప్లాన్ చేస్తే ఫలితాలు ఇంకా మరో లెవెల్ లో ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.