భారత సంతతి రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం.. నిందితుడికి ఇరాన్ సంస్థ భారీ నజరానా

భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీపై గతేడాది అమెరికాలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.నాటి ఘటనలో చావు అంచులదాకా వెళ్లొచ్చారు సల్మాన్.

 Iranian Foundation Praised The Man Who Attacked Indian Origin Novelist Salman Ru-TeluguStop.com

అంతేకాదు.ఈ దాడిలో ఆయనకు ఒక కన్ను, ఒక చేయి పనిచేయకుండా పోయాయి.

సుదీర్ఘకాలం పాటు చికిత్స తీసుకున్న సల్మాన్ రష్డీ ఇటీవలే మీడియా ముందుకు వచ్చారు.ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల నేతలు, రచయితలు రష్డీపై జరిగిన దాడిని ఖండించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా.సల్మాన్ రష్డీపై దాడి చేసిన హాది మతార్‌పై ఇరాన్‌లో మాత్రం ప్రశంసల వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ ఫౌండేషన్ మతార్‌కు భారీ నజరానా ప్రకటించింది.నిందితుడు చేసిన పనిని సాహస కార్యంగా అభివర్ణిస్తూ.1000 చదరపు మీటర్ల సాగు భూమిని బహూకరించింది.ఈ మేరకు ఇరాన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

సదరు సంస్థ సెక్రటరీ మొహమ్మద్ ఇస్మాయిల్ జరేయి మాట్లాడుతూ.సల్మాన్ ఇప్పుడు ఒక జీవచ్ఛవం మాత్రమేనని వ్యాఖ్యానించారు.

సల్మాన్ కంటిని, చేతిని పనిచేయకుండా ఆ యువకుడు చేశాడని.తద్వారా ముస్లింలకు సంతోషాన్ని కలిగించాడని ఇస్మాయిల్ అన్నారు.

Telugu Ayatollahali, Hadi Matar, Indianorigin, Iran, Iranian, Mohammad Ismail, N

కాగా.సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’ కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.కానీ ఈ విషయాన్ని ఇరాన్ మాత్రం సీరియస్‌గా పరిగణించింది.నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ .సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై గతేడాది జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

Telugu Ayatollahali, Hadi Matar, Indianorigin, Iran, Iranian, Mohammad Ismail, N

అయితే నాటి ఘటనలో కుడి కన్నును కోల్పోయినా, శరీరం సహకరించుకున్నా రచనను తాను కొనసాగిస్తానని సల్మాన్ స్పష్టం చేశారు.తాజాగా హత్యాయత్నం తర్వాత తొలి ఇంటర్వ్యూను ఇచ్చాడు.న్యూయార్కర్‌కు చెందిన డేవిడ్ రెమ్నిక్ ఆయనను ఇంటర్వ్యూ చేశారు.ప్రస్తుతం తన పరిస్ధితి మెరుగ్గానే వుందని సల్మాన్ రష్డీ అన్నారు.తన బొటనవేలు, చూపుడు వేలు, అరచేతి దిగువ భాగం ఇంకా సహకరించడం లేదని ఆయన తెలిపారు.దీనికి సంబంధించి తాను హ్యాండ్ థెరపీ చేస్తున్నానని సల్మాన్ తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో తనపై దాడి చేసిన వ్యక్తిని ఇడియట్ అని అభివర్ణించాడు.అతనిపై తనకు ఎలాంటి కోపం లేదని సల్మాన్ అన్నారు.

నిందారోపణలను ఎదుర్కోవడానికి తాను చాలా ఏళ్లుగా ప్రయత్నించానని ఆయన చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube