ఫలించిన భారతీయురాలి కృషి : కుల వివక్షపై సీటెల్ కీలక నిర్ణయం.. తొలి అమెరికన్ నగరంగా రికార్డుల్లోకి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో కుల వివక్ష కూడా ఒకటి.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎందరో మహనీయులు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.

 Seattle Becomes First American City To Ban Caste Discrimination , Kshama Sawant-TeluguStop.com

కానీ నేటికి ఇది కొరకరాని కొయ్యలాగే వుంది.ఈ క్రమంలో అమెరికాలోని సీటెల్ నగరం కీలక నిర్ణయం తీసుకుంది.

కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది.తద్వారా ఈ నిర్ణయం తీసుకున్న తొలి అమెరికన్ నగరంగా సీటెల్ అవతరించింది.

దీని వెనుక భారత సంతతికి చెందిన క్షమా సావంత్ కృషి వుంది.

కుల వివక్షను నిర్మూలించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు.

ఈ క్రమంలోనే కుల వివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానానికి సీటెల్ సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.ఈ సందర్భంగా క్షమా సావంత్ మాట్లాడుతూ.తాము సాధించిన విజయాన్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించేందుకు ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం వుందన్నారు.ఇక.ఓటింగ్‌కు కొన్ని గంటల ముందుకు భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ కూడా ఈ తీర్మానానికి మద్ధతు తెలిపారు.

Telugu American, Hindu American, Indianamerican, Kshama Sawant, Seattle-Telugu N

అయితే ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సీటెల్‌లో కుల వివక్ష వ్యతిరేక తీర్మానం వెనుక వున్న మాస్టర్ మైండ్.ఈ సమస్యపై తన ప్రయత్నాలకు ఈక్వాలిటీ ల్యాబ్స్ 200 సంస్థల మద్ధతు కూడగట్టింది.వాటిలో అంబేద్కర్ కింగ్ స్టడీ సర్కిల్,అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, అంబేద్కరైట్ బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ అండ్ బోస్టన్ స్టడీ గ్రూప్ ఉన్నాయి.

కాగా.ఈ తీర్మానానికి హిందూ అమెరికన్ ఫౌండేషన్ వ్యతిరేకమని ప్రకటించింది.

దీని వల్ల దక్షిణాసియా వాసులను వేరుగా చూస్తారని ఈ సంస్థ అభిప్రాయపడింది.

Telugu American, Hindu American, Indianamerican, Kshama Sawant, Seattle-Telugu N

అంతేకాదు.పబ్లిక్ పాలసీలో కులాన్ని క్రోడీకరించడం వల్ల యూఎస్‌లో హిందూఫోబియాకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని మెజారిటీ ఇండో అమెరికన్లు భయపడుతున్నారు.గడిచిన మూడేళ్లుగా అమెరికాలోని పలు చోట్ల హిందూ సమాజంపై బెదిరింపులతో దేవాలయాలపై దాడులు, పాటు మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే భారతదేశం 1948లోనే కుల వివక్షను నిషేధించింది.దీనితో పాటు 1950లో మన రాజ్యాంగంలో ఆ విధానాన్ని పొందుపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube