అపజయాల్లో నుంచే విజయాలు పుట్టుకు వస్తాయనేది పెద్దల మాట.హాస్య దర్శకుడు ఈవీవీ సత్యానారాయణ విషయంలోనూ ఇదే జరిగింది.
తన మొదటి మూవీ చెవిలో పువ్వు డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఇవివి సత్యనారాయణ చాలా ఆవేదన చెందాడు.
ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాడు.అయితే ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈవీవీని నమ్మి ప్రేమ ఖైదీ మూవీకి అవకాశం ఇచ్చాడు.
ఈ సినిమాతో హిట్టు కొట్టి ఇండస్ట్రీలో పాతుకుపోయారు.ఆయన రుణం ఎలాగైనా తీర్చుకోవాలని చాలా సార్లు అనుకున్నాడట ఈవీవీ.
రామానాయుడు అబ్బాయి వెంకటేష్ తో ఆయన సొంత బ్యానర్లో ఓ సినిమా చేసి హిట్టు కొట్టాలని భావించాడట.
అనుకున్నట్లుగానే వెంకటేష్ గతో సినిమాలు చేసే అవకాశం ఇవివి సత్యానారాయణకు వచ్చింది.
ఆయనతో చేసిన సినిమాలు సూపర్ హిట్లు కూడా అయ్యాయి.కానీ అవి రామానాయుడు బ్యానర్లో చేసినవి కావు.
అయితే వెంకీతో ఇవివి చేసిన అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
![Telugu Evv Satyanaraya, Intloellalu, Intloillaalu, Ramanaidu, Soundarya, Venkate Telugu Evv Satyanaraya, Intloellalu, Intloillaalu, Ramanaidu, Soundarya, Venkate]( https://telugustop.com/wp-content/uploads/2021/05/intlo-ellalu-vantintlo-priyuralu-movie-soundarya-e.v.v-satyanaraya-ramanaidu.jpg)
తాజాగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా విడుదలయ్యి 25 ఏళ్ళు నిండాయి.1996 మే 22న ఈ చిత్రం విడుదలయ్యింది.ఇద్దరి పెళ్ళాల మధ్య నలిగిపోయిన మొగుడి పాత్రలో వెంకీ పండించిన కామెడీకి ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.
తాయ్ కులమే తాయ్ కులమే అనే తమిళ సినిమాకి ఈ సినిమా రీమేక్.అయితే తెలుగులో మొదట ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చాలా మంది హీరోలను సంప్రదించారట దర్శకుడు ఇవివి.
కానీ ఆ హీరోల్లో కొందరు తమ ఇమేజ్ కు సూట్ అవ్వదన్నారట.మరికొంత మంది అయితే టైటిల్ మారిస్తే చేస్తాము అని చెప్పారట.అందుకు దర్శకుడు నొ చెప్పడంతో వాళ్ళు ఈ రీమేక్ ను రిజెక్ట్ చేసినట్టు తెలిసింది.ఫైనల్ గా వెంకటేష్ ఎటువంటి నామోషీ ఫీలింగ్ పెట్టుకోకుండా ఈ సినిమా చెయ్యడం.
అది సూపర్ హిట్ అవ్వడం అలా జరిగిపోయాయి.