విశ్వక్ సేన్ కు మద్దతుగా గృహలక్ష్మి సీరియల్ నటి.. టీవీ9 పబ్లిసిటీ బాగా చేసింది అంటూ!

హీరో విశ్వక్ సేన్ ఈ పేరు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.హీరో విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిన ఒక ఫ్రాంక్ వీడియో వైరల్ అవగా అదే విషయం లోనే టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ని గెట్ అవుట్ మై స్టూడియో అంటూ గట్టిగా అరవడంతో ఆ విషయం కాస్త పెద్ద వివాదంగా మారింది.

 Intinti Gruhalakshmi Actress Kasthuri Shankar Reacts On Vishwak Sen Vs Devi Naga-TeluguStop.com

అయితే ఈ విషయం జరిగిన తరువాత హీరో విశ్వక్సేన్ కీ అభిమానులు పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే సదరు యాంకర్ దేవి నాగవల్లి పై దుమ్మెత్తి పోస్తూ ఆమె పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ టీవీ9 ఛానల్ పై సెటైర్లు వేస్తూ.విశ్వక్ సేన్ పై రెస్పెక్ట్ పెరిగింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా కస్తూరి శంకర్ విశ్వక్సేన్ కి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసింది.విశ్వక్ సేన్ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నేను హిట్ సినిమా చూసినప్పటి నుంచి విశ్వక్ సేన్ ని ఇష్టపడుతున్నాను.

ఈరోజు ఒక వీడియో చూశాను దానితో అతని పై మరింత రెస్పెక్ట్ పెరిగింది.అసలు ఏ ప్రాంక్ వీడియో చేసిన రానంత పబ్లిసిటీ టీవీ9 ఛానలే క్రియేట్ చేసింది.

ఆల్ ది బెస్ట్ సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్ సేన్ నీ కొత్త మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణ్ సినిమాకి కూడా ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసింది కస్తూరి శంకర్.ఇక కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ ని చూసిన అభిమానులు ఆమెను మెచ్చుకుంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.కేవలం కస్తూరి శంకర్ మాత్రమే కాకుండా ఇంకా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలుస్తున్నారు.విశ్వక్ సేన్ అభిమానులు యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ పట్ల ప్రవర్తించిన తీరు పై దుమ్మెత్తి పోస్తూ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube