న్యాచురల్ స్టార్ నాని ( Nani )వరుస సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటాడు.మాస్ రాజా తర్వాత నాని ఏడాది మూడు సినిమాలతో అలరించే హీరోల్లో ముందు ఉంటాడు.
అయితే కరోనా తర్వాత నాని ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు.వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న నానికి దసరా వంటి బ్లాక్ బస్టర్ పడింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొత్తం 110 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.ఇక నాని ఈ సినిమా తరవాత కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ ప్రకటించి షూట్ కూడా వెంటనే స్టార్ట్ చేసాడు.
ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం పూర్తి చేయడంతో నెక్స్ట్ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు అని తెలుస్తుంది.తాజాగా నాని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.
ఈ సరికొత్త పోస్ట్ నెట్టింట అందరిని ఆకట్టుకుంటుంది.రెడీ? అంటూ థియేటర్ లో క్లిక్ చేసిన పిక్ ను షేర్ చేసాడు.
మరి ఈ పిక్ చూస్తుంటే నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ అని తెలుస్తుంది.దీన్ని బట్టి అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ లేదా టీజర్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అనే టాక్ మొదలైంది.చూడాలి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో.ఇక నాని 30వ సినిమా విషయానికి వస్తే ఇందులో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్ పోషించనుండగా.
వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.