దేవీ నాగవల్లితో గొడవ పెట్టుకుంటే సినిమా హిట్టే.. ఆ సినిమాలు ప్రూవ్ చేశాయంటూ?

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో దేవీ నాగవల్లి పేరు మారుమ్రోగుతోంది.దేవీ నాగవల్లికి మద్దతుగా మాట్లాడే వాళ్ల కంటే దేవీ నాగవల్లికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

 Interesting Sentiment About Devi Nagavalli Details, Devi Nagavalli, Devi Nagaval-TeluguStop.com

సోషల్ మీడియాలో దేవీ నాగవల్లిని నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు.కొంతమంది ఆమె వ్యక్తిగత జీవితం గురించి సైతం నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అయితే దేవీ నాగవల్లికి సంబంధించి ఆసక్తికర సెంటిమెంట్ తెరపైకి వచ్చింది.

దేవీ నాగవల్లితో గొడవ పెట్టుకుంటే సినిమా హిట్టేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

అర్జున్ రెడ్డి, డీజే టిల్లు, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు ఈ సెంటిమెంట్ నిజమేనని ప్రూవ్ చేశాయి.భవిష్యత్తులో చిన్న సినిమా హిట్ కావాలంటే దేవీ నాగవల్లితో గొడవ పెట్టుకోవాలంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి జరిగిన డిబేట్స్ లో దేవీ నాగవల్లి పాల్గొనడంతో పాటు ట్రైలర్ లోని సీన్ల గురించి నెగిటివ్ గా కామెంట్లు చేశారు.

Telugu Arjun Reddy, Ashokavanamlo, Devi Nagavalli, Dj Tillu, Vishwak Sen-Movie

అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.డీజే టిల్లు సినిమా రిలీజ్ సమయంలో కూడా దేవీ నాగవల్లి సిద్ధు జొన్నలగడ్డను ఇంటర్వ్యూ చేయడంతో పాటు వివాదాస్పద ప్రశ్నలు అడిగారు.అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

Telugu Arjun Reddy, Ashokavanamlo, Devi Nagavalli, Dj Tillu, Vishwak Sen-Movie

తాజాగా దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ స్టూడియోలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.అయితే సినిమా రిజల్ట్ మాత్రం పాజిటివ్ గా వచ్చింది.తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నిర్మాతలకు ఈ సినిమా భారీ లాభాలను అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.ఈ విధంగా దేవీ నాగవల్లి వల్ల టాలీవుడ్ సినిమాలు హిట్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube