బాషా.1995 లో విడుదల అయినా ఈ చిత్రం సౌత్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచింది.ఈ చిత్రంలో నగ్మా హీరోయిన్ గా నటించగా, తమిళ దర్శకుడు సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసాడు.
ఈ సినిమా లో ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు డైలాగ్ ముప్పై ఏళ్లుగా చాల పాపులర్.కోట్ల మంది ఈ డైలాగ్ ని ఎన్ని సార్లు నిజ జీవితంలో కూడా చెప్పి ఉంటారు.
ఇక ఈ సినిమా చాల సార్లు టీవిలో వచ్చిన, చుసిన ప్రతి సారి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంటాయి.అవేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మాణిక్ బాషా. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో తన ఫ్రెండ్ అన్వర్ బాషా ని చంపినా రౌడీ లను చంపేసి తాను డాన్ అవుతాడు.
ఇలా విలన్ గ్యాంగ్ ని చంపి డాన్ అయ్యాడంటే అతడికి ఒక పాతిక ఏళ్లయినా ఉంటాయి కదా.ఇక డాన్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించి పెద్ద మేడా కట్టి రాజు లాగ బ్రతకడానికి మరొక 5 ఏళ్ళు పట్టిన, తండ్రి కి ఇచ్చిన మాట కోసం ముంబై ని వదిలేసి చెన్నై చేరుకునే సమయానికి బాషా కి ఒక 30 ఏళ్ళు ఉంటాయి.అయితే చెన్నై కి వచ్చి చిన్న చిన్న తన తోబుట్టువులను పెద్దవాళ్ళను చేసి ఆటో నడుపుతూ ఉండే సమయానికి మరొక 15 ఏళ్ళు.అంటే మొత్తం గా మన బాషా కు నగ్మా పరిచయం అయ్యేసరికి అతడి వయసు ఒక 45.అంటే 20 ఏళ్ళ నగ్మా కి 45 ఏళ్ళ భాషతో లవ్వాయణం అన్నమాట.
సరే ఏ వయసు వారైనా ఎవరినైనా ప్రేమించవచ్చు.అక్కడితో ఈ డౌటానుమానానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే, తన తమ్ముడు పోలీస్ వాడై అన్నను పట్టుకొని బాషా ముంబై నేపథ్యం గురించి ప్రశ్నిస్తాడు.ఇక ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ గా కనిపించిన నగ్మా తండ్రి, ప్రెసెంట్ లో మాత్రం ముసలి వాడిలా కనిపిస్తాడు.
తన గ్యాంగ్ అంత ముసలి వాళ్ళయినా తాను మాత్రం అలాగే యంగ్ లుక్ లో ఉంటాడు.అంత సినిమా మాయ.హీరో కి ఎప్పటికి వయసు అయిపోదు.హీరో కాబట్టి ఎప్పటికి యంగ్ గానే ఉండాలి.
అయితే చూసే ప్రేక్షకుల్లో ఎవరికీ ఈ డౌట్ వచ్చి ఉండకపోవచ్చు.ఎందుకంటే కథలో దర్శకుడు మనల్ని అంతగా లీనం చేసాడు.