ఇప్పటికే బిగ్ బాస్ చెత్త క్రియేటివ్ టీమ్ ను ప్రతి ఆర్టికల్ లో తిట్టుకుంటూనే ఉన్న కూడా వారి తీరులో ఎలాంటి మార్పులు కనబడటం లేదు.వారి వాళ్ళ ఇటు నాగార్జున అటు టీమ్ అందరు పరువు పోగొట్టుకుంటున్నారు.
వీరి సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఆట జరుగుతున్న ఆట ఆడిస్తున్న తీరు చూసి చూస్తే అందరు కట్ట కట్టుకొని ఇనాయను మరో కౌశల్ ని చేసేలా ఉన్నారు.లేదంటే టాప్ 5 లో అయినా పెట్టె దాటాక ఉరుకునేలా లేరు.
హౌస్ లో ఆమె ప్రవర్తన ఎవరికీ నచ్చడం లేదు.మనకు చూపించే ఫుటేజ్ లో అంత వన్ సైడ్ టార్గెట్ లాగ కనిపిస్తున్న ఆమె కొంతమేర హౌస్ మేట్స్ ని చికాకు పెడుతూ ఉండచ్చు. అయితే ఎవరు ఎలా చేసిన, ఎంత చికాకు పెట్టిన సంయమనం పాటిస్తేనే కదా అది బిగ్ బాస్ హౌస్ అవుతుంది.కానీ అందరు చూస్తున్నారు అనే భయం లేకుండా నోటికి పని చెప్తున్నారు.
ఇక ఇనాయ పై ఎక్కువ గా ఇంటి సభ్యులు నోరు పారేసుకోవడం వల్ల ఆమెపై జనాల్లో సానుభూతి పెరుగుతుంది.ఇనాయ సైతం రోజురోజులకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతుంది.
ఆమె గేమ్స్ విషయంలో పోరాడే తీరు కూడా అందరు చూస్తూనే ఉన్నారు.గత రెండు మూడు వారాలుగా ఇనాయను బాగా పెర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు అయినా ఆమె చాల బాగా వ్యవహరిస్తోంది.
శ్రీ సత్య ఇనాయను భూతుల తిడుతున్న ఆమెను బిగ్ బాస్ టీమ్ ఏం అనరు.
ఇక ఆదిరెడ్డి సైతం మొన్న ఇనాయాను ఉద్దేశించి ఒక భూతు మాట అన్నాడు.ఈ జర్నీ మొత్తం ఎవడో ఒకడిని గోకుతూనే ఉంటావా అనడం ఆమె క్యారెక్టర్ ని బ్లేమ్ చేసినట్టు కాదా, వారాంతం లో నాగార్జున వచ్చి కోపంలో ఇష్టం వచ్చినట్టు భూతులు మాట్లాడతావా, ఎఫ్ వర్డ్ కూడా వాడుతావా అంటూ ఇనాయా ను అన్నాడు.మరి రేవంత్ మాట్లాడుతున్న భూతులు ఆయనకు కనిపించడం లేదా, రేవంత్ ని బిగ్ బాస్ టీమ్ బాగానే టాప్ కి పంపించడానికి మోస్తూ వస్తుంది.
ఇక ఫైమా సైతం ఇనాయాను ఒక మాట అనేసింది.నువ్వు సూర్య కలిసి ఏం చేసారో చూసాం లే అంటూ మాట్లాడింది.మరి ఇలాగే ఇనాయా పై దాడి చేస్తూ పోతే ఆమె టాప్ 5 కి మతమే కాదు ట్రోఫీ కి సైతం దగ్గరగా వెళ్తుంది.