CM Jagan : ఆ సర్వేను మాత్రమే నమ్ముతున్న సీఎం జగన్.. ఏపీలో వైసీపీకి అన్ని సీట్లు ఖాయమా?

ఏపీలో ఎన్నికలకు మరో 48 రోజుల సమయం మాత్రమే ఉండగా ఆలస్యంగా ఎన్నికలు జరగడం వల్ల ఏ పార్టీకి బెనిఫిట్ కలుగుతుందో చూడాల్సి ఉంది.ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వైసీపీ( YCP ) కరెంట్ కోతలు, నీటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

 Intelligence Survey Hopes On Cm Jagan Details Here Goes Viral In Social Media Y-TeluguStop.com

అయితే ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే రాష్ట్రంలో వైసీపీకి 115 సీట్లు వస్తాయని వెల్లడించినట్లు తెలుస్తోంది.ఆ సర్వే ఫలితాలను మించి ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నట్టు భోగట్టా.


గ్రామీణ ప్రజల్లో, మహిళల్లో వైసీపీ పట్ల పాజిటివిటీ ఉందని జగన్ ( CM Jagan )నమ్ముతున్నట్టు తెలుస్తోంది.తన లెక్క ప్రకారం 130 సీట్లు వైసీపీకి కచ్చితంగా వస్తాయని జగన్ భావిస్తున్నట్టు భోగట్టా.అధికారం మాత్రమే వైసీపీకే వస్తుందని ఇతర పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తు వల్ల వైసీపీకే లాభమని జగన్ ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది.ఆ సర్వేను నమ్ముకున్న జగన్ కు ఏ రేంజ్ లో బెనిఫిట్ కలుగుతుందో చూడాలి.

మరోవైపు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రచారం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.వైసీపీ ఏయే నియోజకవర్గాలలో వీక్ గా ఉందో ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది.వైసీపీ గెలుపు కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతుండటం గమనార్హం.వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎక్కువమంది సిట్టింగ్ లకే సీట్లు దక్కాయి.

వైసీపీ కొన్ని నియోజకవర్గాలలో టీడీపీని( TDP ) కచ్చితంగా ఓడించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం అందుతోంది.వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నవాళ్లను ఆకట్టుకునేలా జగన్ ఏం చేస్తారో చూడాలి.వైసీపీకి కొన్ని నియోజకవర్గాలు కంచుకోట లాంటి నియోజకవర్గాలు కాగా అక్కడ మాత్రం గెలుపుకు ఢోకా లేదని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube