ఆస్ట్రేలియా దేశానికి తరలిపోతున్న ఇండియన్స్.. కారణమదే...

భారతీయులు( Indians ) విదేశాలకు తరలిపోయి అక్కడే స్థిరపడిపోవడం ఎప్పటినుంచో జరుగుతోంది.ముఖ్యంగా అమెరికా, దుబాయ్, సింగపూర్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఇండియన్స్ అధికంగా వెళ్తారు.

 Indians Moving To Australia.. The Reason Is.. , Australia, Indians, Immigrants,-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా( Australia )కు కూడా పెద్ద మొత్తంలో ఇండియన్స్ తరలిపోతున్నారు.ఫలితంగా అక్కడ భారతీయుల జనాభా అంతకంతకూ పెరుగుతోంది.

అక్కడికి వెళ్తున్న ఇండియన్స్ వ్యాపారాలు స్థాపిస్తూ అక్కడే సెటిల్ అయిపోతున్నారు.కొందరు హోటల్, రెస్టారెంట్ బిజినెస్‌లు స్థాపిస్తుంటే, మరికొందరు పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో వలస భారతీయుల సంఖ్య అధికంగా ఉండటమే ఇక్కడికి ఇండియన్స్‌ తరలి వెళ్లడానికి కారణం అని తెలుస్తోంది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వలసలు చాలా ఏళ్ల క్రితం నుంచే మొదలయ్యాయి.

గతంలో ఇండియా, ఆస్ట్రేలియా దేశాలు గోండ్వానా అనే మహాఖండంలో ఉండేవి.అప్పుడే అంటే 1800లలోనే భారతీయులు ఆస్ట్రేలియా దేశానికి వెళ్లడం ప్రారంభించారు.1900ల్లో ఈ వలసలు గణనీయంగా పెరిగాయి.

Telugu Australia, Indian, Indians, Latest, Nri, Whiteaustralia-Telugu NRI

ఆపై 1973లో ‘వైట్ ఆస్ట్రేలియా పాలసీ‘ క్యాన్సిల్ అయింది.ఫలితంగా వలసలు కొన్ని రెట్ల స్థాయిలో ఎగబాకాయి.అయితే ఆ సమయంలో ఇండియా నుంచి టెక్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు, విద్యావేత్తల వంటి ప్రొఫెషనల్స్ ని మాత్రమే ఆస్ట్రేలియా తమ దేశంలోకి అనుమతించేది.అది కూడా తక్కువ సంఖ్యలో ప్రజలను మాత్రమే ప్రవేశానికి వీలు కల్పించేది.2006 తర్వాత ఇండియన్స్ వలసలకు పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Telugu Australia, Indian, Indians, Latest, Nri, Whiteaustralia-Telugu NRI

ఇకపోతే వలసదారులు ఆస్ట్రేలియా దేశానికి భారత సంస్కృతి, ( Indian culture )సంప్రదాయాలు తీసుకొచ్చారు.దీనివల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని కూడా పలువురు చెబుతుంటారు.ఇక వలసగా వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, సంప్రదాయాలను నృత్యాలను స్థానికులకు నేర్పించాలని తమ వంతుగా కృషి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube