సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు మనకు దర్శనమిస్తాయి.అందులోకొన్ని దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటే మరికొన్ని నవ్వుని తెప్పిస్తాయి.
కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని హృదయాన్ని కలచివేసేవిగా ఉంటాయి.తాజాగా అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోని చూస్తే, హృదయ విదారకాన్ని అనుభవించేది కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు ( Animals ) కూడా అనుభవిస్తాయని గోచరించకమానదు.అలాంటి హృదయ విదారక ఘట్టం ఒకటి కెమెరాకు చిక్కడంతో ఆ దృశ్యం సోషల్ మీడియాలో పోస్ట్ కాబడింది.

అవును, శోకంలో ఉన్న తల్లి ఏనుగు( Mother Elephant ) చనిపోయిన తన బిడ్డను( Baby Elephant ) బ్రతికించేందుకు యత్నిస్తున్న దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి.మనుషులకు మల్లే, జంతువులు తమ పిల్లల పట్ల చాలా సున్నితంగా ప్రవర్తిస్తాయి.దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలను మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు.కోతి నుండి ఏనుగు, కుక్క, చిరుత వరకు తమ బిడ్డను అన్ని విధాలుగా సురక్షితంగా కాపాడతాయి.
దీంతో పాటు వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటాయి.అలాంటి భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.వీడియో చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోను IFS అధికారి అయినటువంటి సుశాంత్ నందా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా ఆ వీడియో వెలుగు చూసింది.ఆయన ఆ దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ… ఇది చూడగానే నా గుండె పగిలిపోయింది అనే క్యాప్షన్ జోడించారు.వీడియోని గమనిస్తే ఏనుగు పిల్ల ఎప్పుడో చనిపోయింది.
ఈ విషయం తెలియక ఆ తల్లి ఏనుగు చిన్నారికి అనారోగ్యంగా భావించి 2 కి.మీ.దూరం వరకు దానిని మోసుకెళ్లింది.ఆ ఏనుగు పిల్లపై నీళ్లు పడితే బహుశా బతుకుతుందేమోని నీళ్లలో పడవేసింది.
అయినా ఫలితం లేదు.ఈ హృదయ విదారక సంఘటన గోరేశ్వర్‌లో జరిగిందని తెలిసింది.
జూన్ 15 న పోస్ట్ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో రెండు ఏనుగులు అడవి మధ్యలో నిలబడి ఉండటం గమనించవచ్చు.ఈ వీడియోకి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.







