హిట్ అండ్ రన్ కేసు : ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధికి ఊరట

హిట్ అండ్ రన్ కేసుకు( Hit-And-Run Case ) సంబంధించి ఆస్ట్రేలియాలో ( Australia ) భారతీయ విద్యార్ధికి ఊరట లభించింది .అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

 Indian Student Gets Bail In Alleged Hit-and-run Case In Australia Details, India-TeluguStop.com

నిందితుడిని 18 ఏళ్ల వంశ్ ఖన్నాగా( Vansh Khanna ) గుర్తించారు.ఈ ప్రమాదానికి సంబంధించి నిందితుడిని గురువారం సాయంత్రం లేన్ కోవ్‌లోని ఫాక్స్ స్ట్రీట్‌లో అరెస్ట్ చేసి చాట్స్ వుడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సిడ్నీ మార్కింగ్ హెరాల్డ్ నివేదించింది.

శుక్రవారం మ్యాన్లీ లోకల్ కోర్టులో అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.ఈ సందర్భంగా తరచుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని.

కారు నడపకూడదని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

Telugu Australia, Australia Nri, Chatswood, Run, Indian, Rash, Sydney, Vansh Kha

సిడ్నీలో గురువారం 12 నుంచి 13 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలురు రోడ్డును దాటుతుండగా వంశ్ కారు వారిని ఢీ కొట్టింది.దీనిపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు తక్షణం ఘటనాస్థలికి చేరుకున్నాయి.న్యూ సౌత్ వేల్స్‌ పారామెడిక్స్ వారికి చికిత్స అందించారు.

అయితే పిల్లల కాలు, తలపై గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన తర్వాత కారును నడిపిన వ్యక్తి కనీసం ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Telugu Australia, Australia Nri, Chatswood, Run, Indian, Rash, Sydney, Vansh Kha

అనంతరం పోలీసులు ఖన్నాను అరెస్ట్ చేసి అతనిపై ఏడు అభియోగాలు మోపారు.వీటిలో ప్రమాదకర డ్రైవింగ్, హాని కలిగించే ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, దుష్ప్రవర్తన, రెడ్ సిగ్నల్ జంప్, సహాయం చేయడంలో విఫలం తదితర అభియోగాలను మోపారు.దర్యాప్తులో భాగంగా ఖన్నా నడిపిన హోండా అకార్డ్‌ కారును మెకానికల్, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నోటీసు కూడా జారీ చేశారు.

జూన్ 8న వంశ్ ఖన్నా మరోసారి కోర్టు ఎదుట విచారణకు హాజరుకానున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube