హిట్ అండ్ రన్ కేసు : ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధికి ఊరట
TeluguStop.com
హిట్ అండ్ రన్ కేసుకు( Hit-And-Run Case ) సంబంధించి ఆస్ట్రేలియాలో ( Australia ) భారతీయ విద్యార్ధికి ఊరట లభించింది .
అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.నిందితుడిని 18 ఏళ్ల వంశ్ ఖన్నాగా( Vansh Khanna ) గుర్తించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి నిందితుడిని గురువారం సాయంత్రం లేన్ కోవ్‌లోని ఫాక్స్ స్ట్రీట్‌లో అరెస్ట్ చేసి చాట్స్ వుడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సిడ్నీ మార్కింగ్ హెరాల్డ్ నివేదించింది.
శుక్రవారం మ్యాన్లీ లోకల్ కోర్టులో అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
ఈ సందర్భంగా తరచుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని.కారు నడపకూడదని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
"""/" /
సిడ్నీలో గురువారం 12 నుంచి 13 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలురు రోడ్డును దాటుతుండగా వంశ్ కారు వారిని ఢీ కొట్టింది.
దీనిపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు తక్షణం ఘటనాస్థలికి చేరుకున్నాయి.న్యూ సౌత్ వేల్స్ పారామెడిక్స్ వారికి చికిత్స అందించారు.
అయితే పిల్లల కాలు, తలపై గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన తర్వాత కారును నడిపిన వ్యక్తి కనీసం ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
"""/" /
అనంతరం పోలీసులు ఖన్నాను అరెస్ట్ చేసి అతనిపై ఏడు అభియోగాలు మోపారు.
వీటిలో ప్రమాదకర డ్రైవింగ్, హాని కలిగించే ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, దుష్ప్రవర్తన, రెడ్ సిగ్నల్ జంప్, సహాయం చేయడంలో విఫలం తదితర అభియోగాలను మోపారు.
దర్యాప్తులో భాగంగా ఖన్నా నడిపిన హోండా అకార్డ్ కారును మెకానికల్, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నోటీసు కూడా జారీ చేశారు.జూన్ 8న వంశ్ ఖన్నా మరోసారి కోర్టు ఎదుట విచారణకు హాజరుకానున్నాడు.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!