తిరుమల శ్రీవారిని ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య దర్శించుకున్నారు.సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడుతూ భారత రైల్వేలో ఈనాడు ప్రపంచ స్ధాయికి అనుగుణంగా సేవలందిస్తున్నారు. 2020 -21లో 1400 మిలియన్లు సరుకు రవాణా చేసి దేశంలోని ప్రతి రాష్ట్రానికి సేవలు అందిస్తూ వస్తోందన్నారు.
17.18 శాతం రైల్వే ఆదాయంను పెంచుకోగలిగామని, ఇలా అభివృద్ధి చేందుతున్న భారత రైల్వేలను అమ్మకానికి ప్రభుత్వం పెట్టిందని, మానిటరైజేషన్ పేరుతో, లీజ్ పేరుతో ప్రవేటుపరం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నారు.దీనిపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే 1300 లక్షల మంది రైల్వే కార్మికులను సమావేశ పరిచి, వ్యతిరేకించాలని, పోరాటం చేసి రైల్వేని బతికించుకోవాలని కోరారు.దేశాన్ని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు.
రైల్వే సంక్షేమం కోసం రైల్వే కార్మికులు అంతా కలిసి రావాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రభుత్వ ఆధీనంలోనే భారత రైల్వే నడిచే విధంగా పోరాటంను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.కొత్త ఫించన్ స్కిమ్ ను రద్దు చేయాలనే ప్రతిపాదన ఇద్దరు రైల్వే శాఖా మంత్రులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా నేటి వరకూ చలనం లేదన్నారు.బైట్ : మర్రి రాఘవయ్య, ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ.