మానసిక, శారీరక సమస్యలతో (డౌన్ సిండ్రోమ్) బాధపడుతున్న మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేసిన నేరంపై భారత సంతతికి చెందిన వ్యక్తికి న్యూజిలాండ్( New Zealand ) కోర్ట్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.నిందితుడిని 33 ఏళ్ల శామల్ శర్మగా ( Samal Sharma )గుర్తించారు.
ఇతను 2021 సెప్టెంబర్ 22న అక్లాండ్‌లో వాకింగ్ చేస్తుండగా.డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 27 ఏళ్ల లీనా జాంగ్ హర్పర్ ( Lena Zhang Harper )అనే మహిళను గమనించాడు.
ఈ క్రమంలో ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు గొంతుకోసి హతమార్చినట్లు ఎన్‌జెడ్ హెరాల్డ్ వార్తాపత్రిక గురువారం నివేదించింది.ఆమె మృతదేహం మౌంట్ అల్బర్ట్‌లోని ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పొదల మాటున కనిపించింది.
ఇందుకోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలించారు.వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే నెల 24న శర్మను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.లీనాను నిందితుడు దాదాపు రెండు గంటల పాటు చిత్రహింసలు పెట్టాడు.ఆమె గొంతు కోయడానికి ముందే ముఖంపై దాడిచేసినట్లుగా పోలీసులు తెలిపారు.బాధితురాలి తలపై 13 గాయాలు వున్నాయని.వీటి ప్రభావం మెదడు అంతర్గత భాగాలపై పడి చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు.కొన్ని గాయాలు చాలా క్రూరంగా వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రౌన్ ప్రాసిక్యూటర్ మాథ్యూ నాథన్( Matthew Nathan ).మాట్లాడుతూ నిందితుడికి స్కిజోఫ్రెనియా వుందని తెలిపారు.అయితే నేరానికి పాల్పడే సమయంలో చట్టం తెలిపిన విధంగా మానసిక రోగిగా లేడని ఆయన పేర్కొన్నారు.లైంగిక వాంఛలు తీర్చుకునేందుకే శర్మ దాడికి తెగబడినట్లుగా నాథన్ తెలిపారు.
శాడిజం పరాకాష్టకు ఈ కేసు ఉదాహరణ అని నాథన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.లీనాను హత్య చేయడానికి 24 గంటల ముందు వెస్ట్ ఆక్లాండ్‌లోని( West Auckland ) హెండర్సన్‌లో జాగింగ్ చేస్తున్న మరో మహిళను కూడా నిందితుడు వేధించినట్లు అభియోగాలు మోపారు.
న్యాయమూర్తి తీర్పు వెలువరించిన సమయంలో నిందితుడు శర్మలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు.అయితే అతనికి ఈ శిక్ష సరిపోదని.
తాము కోల్పోయిన దానికి ఇది ఏమాత్రం సమానం కాదని లీనా తల్లి తీర్పు అనంతరం పేర్కొన్నారు.