రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )నటించిన ఆదిపురుష్( Adipurush ) సినిమా నెక్స్ట్ మంత్ 16న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.రామాయణ కథతో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
రేపు అనగా మే 9న ట్రైలర్ రిలీజ్ ఫిక్స్ చేశారు.ఏ.ఎం.బి మాల్ లో ప్రభాస్ అండ్ టీం కలిసి ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.అయితే ఆదిపురుష్ సినిమా విషయంలో మొదట్ నుంచి నేషనల్ మీడియా అంతగా ఫోకస్ చేయటేదు.ప్రభాస్ సినిమా అని లైట్ తీసుకున్నారా లేక మరే కారణమో కానీ ఆదిపురుష్ పై ఎలాంటి బజ్ క్రియేట్ అవట్లేదు.
తెలుగులో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నా సరే ఎందుకో ఆదిపురుష్ మీద అనుకున్నంత హైప్ మాత్రం క్రియేట్ అవ్వట్లేదు.ముఖ్యంగా టీజర్ లో గ్రాఫిక్స్ విషయంలో డిజప్పాయింట్ కాగా ట్రైలర్ వచ్చే దాకా సినిమా గురించి చెప్పడం కష్టం అంటున్నారు.
ఆదిపురుష్ సినిమా ఓం రౌత్ డైరెక్ట్ చేయగా సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్( Kriti Sanon ), సైఫ్ అలి ఖాన్ నటించారు.టీ సీరీస్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేస్తున్నారు.







