విక్టరీ వెంకటేష్ సైంధవ్ తో( Saindhav Movie ) తన యాక్షన్ మోడ్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.శైలేష్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్( Venkatesh ) చేస్తున్న సైంధవ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత వెంకటేష్ త్రివిక్రం తో సినిమా చేయాలని అనుకున్నారు.
త్రివిక్రం ( Trivikram ) డైలాగ్ రైటర్ గా ఉన్నప్పుడే అతనితో సూపర్ హిట్లు కొట్టిన వెంకటేష్ ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.అయితే వెంకటేష్ రెడీ అంటున్నా త్రివిక్రం వెంకటేష్ తో చేసే సినిమా కథ ఆలోచన రావట్లేదని టాక్.

అందుకే వెంకటేష్ 75వ సినిమా త్రివిక్రం తో చేయాలని అనుకున్నా అది కాస్త శైలేష్ కొలను ఖాతాలో పడింది.76వ సినిమా అయినా త్రివిక్రం చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.అయితే కొన్నాళ్లుగా తరుణ్ భాస్కర్ తో సినిమా హోల్డ్ లో పెట్టిన వెంకటేష్ ఆ సినిమాను లైన్ లోకి తెస్తున్నట్టు టాక్.వెంకటేష్ దాదాపు తరుణ్ తోనే తన నెక్స్ట్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఈతరం దర్శకుల్లో ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.







