ప్రతీ రోజు పని, చేతి నిండా డబ్బు, తమ సొంత ప్రాంతంలో కంటే అత్యధికంగా డబ్బు వస్తుందనే ఆలోచనతో ఎంతో మంది భారతీయులు తమ ప్రాంతాలను, కుటుంబ సభ్యులను, విడిచి దేశాలు దాటుకుని మరీ విదేశాలకు కార్మికులుగా వలసలు వెళ్తుంటారు.అయితే వెళ్ళే ముందు మనం వెళ్ళే దేశం యొక్క ఆర్ధిక పరిస్తితులు, అక్కడ ఉంటున్న మన భారతీయుల పరిస్థితులు ఎలా ఉంటున్నాయో తెలుసుకుని వెళ్ళడం సరైన విధానం లేదంటే బొక్క బోర్లా పడటం ఖాయం.
వివరాలలోకి వెళ్తే.
భారతీయులు వలస కార్మికులుగా అత్యధికంగా ఎడారి దేశాలకు వలసలు వెళ్తుంటారు.
ఈ క్రమంలో ఎన్నో దేశాలు వారిని ఆదరించి మంచి జీతం, ఉపాది కల్పించినా కొన్ని దేశాలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.ఉద్యోగాలు ఊడ పీకుతూ కువైట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే తాజాగా బహ్రెయిన్ మాత్రం అక్కడ పనిచేస్తున్న వలస ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది.
తక్కువ జీతం ఉన్న కార్మికులు ప్రస్తుతం బహ్రెయిన్ నిర్ణయాలతో బెంబేలెత్తిపోటున్నారు.ఒక పక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంటే కార్మికుల జీతాలలో ఎలాంటి మార్పు లేదని వాపోతున్నారు.
జీతాలలో పెరుగుదల లేదు కదా వచ్చేద్దామా అంటే అల్పాదాయా కార్మికులు అక్కడ చేసిన అప్పుల దెబ్బకు రాలేకపోతున్నారు.ఒక పక్క పెరుగుతున్న నిత్యావసర ధరలు, మరో పక్క పెరగని జీతాలతో సతమతమవుతున్నారు.అక్కడ తాజా తెలిసిన విషయం ఏంటంటే ఎంతో మంది వలస కార్మికులు గడిచిన 17 ఏళ్ళుగా ఎలాంటి ఇన్క్రిమెంట్స్ లేకుండా చేరినప్పుడు ఇస్తున్న జీతాన్నే ఇప్పటికి తీసుకుంటున్నారట.దాంతో అక్కడి ప్రవాసులు మాత్రం బెహ్రాయిన్ ఉద్యోగం నిమిత్తం రావాలని కోరుకునే వారికి మాత్రం ఇక్కడికి వచ్చి తమలా ఇబ్బందులు పడవద్దని సూచిస్తున్నారు.