బిగ్ బాస్ తెలుగు 7 లో కంటెస్టెంట్ గా ఇండియన్ క్రికెటర్..?

తెలుగు బుల్లితెర పై ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss Show ) సరికొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే.ఇప్పటి వరకు ఈ రియాలిటీ షో ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకొని 7 వ సీజన్ ( Bigg Boss7 Telugu ) లోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Indian Cricketer To Participate In Bigg Boss7 Telugu,bigg Boss7 Telugu,indian Cr-TeluguStop.com

ఈ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది.ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన చిన్న ప్రోమో ని కొద్దీ రోజుల క్రితమే విడుదల చేసారు.

అతి త్వరలోనే ఈ సీజన్ కి సంబంధించి మెయిన్ ప్రోమో ని విడుదల చెయ్యబోతున్నారు.గత సీజన్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాకపోవడం తో ఈ సీజన్ ని స్టార్ మా ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయం లో ఎక్కడా కూడా రాజీ పడలేదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.

Telugu Bigg Boss, Nagarjuna, Maa, Venugopal Rao-Movie

ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా( Social Media )లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి, కానీ ఇప్పటికే కచ్చితంగా ఖరారైన కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.అందులో మాజీ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ వేణు గోపాల్ కూడా ఉన్నట్టు సమాచారం.ఇండియన్ క్రికెట్ టీం తరుపున ఎన్నో టౌర్నమెంట్స్ మరియు ఐపీఎల్ మ్యాచులు ఆడిన వేణు గోపాల్ రావు( Venugopal Rao ), ఈమధ్య కాలం లో క్రికెట్ లో అంతగా యాక్టీవ్ గా లేని సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ స్థాయిలో మ్యాచులు ఆడి మన తెలుగోడి సత్తా చాటిన వేణు గోపాల్ రావు, ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వబోతున్నాడు.మరి ఇన్ని రోజులు ప్రేక్షకులు ఆయనని ఒక ఆటగాడిగా మాత్రమే చూసారు , ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ఆయనలోని సరికొత్త కోణాల్ని ఎలా ఆవిష్కరించబోతున్నాడో చూడాలి.

Telugu Bigg Boss, Nagarjuna, Maa, Venugopal Rao-Movie

ఇకపోతే ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయి జంటలను షో లోకి తీసుకొని రాబోతున్నారట.వీరిలో విడాకులు తీసుకున్న జంట కూడా ఉంటుందని సమాచారం.ముందు సీజన్స్ తో పోలిస్తే చాలా ఇన్నోవేటివ్ టాస్కు( Bigg Boss Tasks )లతో ఆసిక్తికరంగా ఈ షో ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 వరకు ప్రతీ సీజన్ స్టార్ మా ఇండియా లోనే టాప్ రేటింగ్స్ దక్కించుకుంటున్న ఛానల్ గా చరిత్ర సృష్టించింది.

ఇప్పుడు త్వరలో ప్రసారం కాబొయ్యే సీజన్ 7 తో మళ్ళీ ఆ రేంజ్ కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.మరి ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందో విఫలం అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube