అమెరికన్ రెస్టారెంట్లపై విమర్శలు చేసిన భారతీయ సంతతి సీఈఓ..

భారతీయ సంతతికి చెందిన యూఎస్ ఆధారిత సీఈఓ, అమెరికన్ రెస్టారెంట్లపై తీవ్రమైన విమర్శలు చేశారు.ఆ విమర్శలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పెద్ద చర్చకు దారితీసాయి.

 Indian Born Ceo Criticized American Restaurants, American Restaurants, Apoorva G-TeluguStop.com

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందించే బెస్టెవర్ ఏఐ అనే కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన అపూర్వ గోవింద్ అమెరికన్ రెస్టారెంట్‌ల సర్వీస్, ఆంబియన్స్ పట్ల తన అసంతృప్తిని వరుస ట్వీట్లలో పంచుకున్నారు.

అపూర్వ ప్రకారం, అమెరికన్ రెస్టారెంట్లు తమ కస్టమర్ల ప్రైవసీ, ఆనందాన్ని గౌరవించవు.వెయిటర్లు తరచూ కస్టమర్లు మాట్లాడుకుంటుంటే చిన్న చిన్న కారణాలతో అంతరాయం కలిగిస్తారని, కస్టమర్లు భోజనం ముగించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని ఫిర్యాదు చేశారు.బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేసే బార్‌ల పట్ల తన అయిష్టతను కూడా వ్యక్తం చేశారు, ఇది మానసిక స్థితిని నాశనం చేస్తుందని ఆమె చెప్పారు.

“అమెరికన్ రెస్టారెంట్లు ప్రజలు మీల్స్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేసేలా ఉండవు.మీరు ఫ్రెండ్లీగా ఉన్నా వెయిటర్ తెలివితక్కువ విషయం గురించి అంతరాయం కలిగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించరు.” అని అన్నారు.“ఫుడ్ కంప్లీట్ చేసినట్లు తెలియగానే, వెయిటర్లు మిమ్మల్ని వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు పంపించేస్తారు.పూర్తి చేసి ప్రశాంతంగా కూర్చునే ఫెసిలిటీ కూడా అందించరు.లాస్ట్ బైట్ మింగిన నిమిషంలో వారు మిమ్మల్ని బయటకు తీసుకురావాలని అనుకుంటారు.ఇది నాకు చికాకు కలిగిస్తుంది, దీనికి అంతం లేదు.” అని అపూర్వ అసంతృప్తి వ్యక్తం చేశారు.అపూర్వ పోస్ట్‌కి ఇతర ఎక్స్‌ యూజర్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.కొందరు ఆమెతో ఏకీభవించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube