తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.అన్ని నియోజకవర్గాల్లో హస్తం పార్టీ హవా సాగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఒక రౌండ్ లెక్కింపు పూర్తి అయిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో తొలి రౌండ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థులు కాస్త ఆధిక్యతలో ఉన్నారు.జహీరాబాద్, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది.
అలాగే వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.మంత్రి గంగుల కమలాకర్ 1523 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు.