వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా నేడు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది.టాస్ గెలిచిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేయడం జరిగింది.
విరాట్ కోహ్లీ 101*(121), శ్రేయాస్ అయ్యార్ 77(87), రోహిత్ శర్మ 40(24), శుబ్ మాన్ గిల్ 23(24), రాహుల్ 8(17), సూర్య కుమార్ యాదవ్ 22(14), రవీంద్ర జడేజా 29(15).పరుగులు చేయడం జరిగింది.
అనంతరం 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆల్ అవుట్ కావటం జరిగింది.దీంతో 243 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టడం జరిగింది.షమ్మీ 2, కుల్దీప్ 2, సిరజ్ 1 వికెట్లు తీశారు.కాగా తన జన్మ దినోత్సవం నాడు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేలలో సచిన్ నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును సమం చేయడం జరిగింది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ జైత్రయాత్ర విజయవంతంగా సాగుతూ ఉంది.ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడంతో పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ లో ఉంది.