మంత్రి పువ్వాడ అజయ్ కు చెక్కును అందించిన శ్రీమిత్ర ఫౌండేషన్ ఛైర్మన్ ప్రవీణ్ భద్రాచలం వరద బాధితుల సహాయక చర్యల కోసం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు రూ.9 లక్షల విరాళాన్ని శ్రీ మిత్ర ఫౌండేషన్ ఛైర్మన్ కురువేళ్ళ ప్రవీణ్ అందించారు.సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసి చెక్కును అందించారు.ఈ సందర్భంగా శ్రీ మిత్ర ఫౌండేషన్ ఛైర్మన్ ప్రవీణ్ మరియు ఇతర ప్రతినిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.
గతంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవారంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న శ్రీమిత్రా ఫౌండేషన్ మరోసారి భద్రాచలం వరద బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశం తో విరాళాన్నీ అందజేసినట్టు ప్రవీణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్, సంస్థ ప్రతినిధులు ఉన్నారు.