After delivery Health Tips : ప్రసవం తర్వాత రోజు ఈ లడ్డూను తీసుకుంటే ఆ సమస్యలన్నీ పరార్!

ప్రసవం అనంతరం ప్రతి మహిళ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది.అలాగే మరెన్నో సమస్యలను ఫేస్ చేస్తుంది.

ముఖ్యంగా ప్రసవం అయిన త‌ర్వాత రక్తహీనత, నీరసం, అలసట వంటి సమస్యలు అధికంగా వేధిస్తూ ఉంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడుతుంటాయి.

అటువంటి ఫుడ్స్ లో ఇప్పుడు చెప్పబోయే లడ్డు కూడా ఒకటి.

ప్రసవం అనంతరం ఈ లడ్డూను ప్రతిరోజు తీసుకుంటే ఆయా సమస్యలన్నీ పరార్ అవ్వడం ఖాయం.

మరింతకీ ఆ లడ్డు ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు వాల్ నట్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఇలా వేయించుకున్న వాల్ న‌ట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత వాల్ నట్స్‌ వేయించిన పాన్ లోనే నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.

నెయ్యి కాస్త హీట్ అవ్వగానే అందులో ఒక‌న్న‌ర‌ కప్పు రాగి పిండి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ పై మరో గిన్నెను పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసి కొద్దిగా వాటర్ పోసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన బెల్లం సిరప్ లో వేయించి పెట్టుకున్న రాగి పిండి, వాల్ న‌ట్స్ ముక్క‌లు, హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.

Telugu Delivery, Anemia, Anemia Problem, Belly Fat, Bone, Tips, Latest-Telugu He

ఈ రాగి వాల్ న‌ట్స్ లడ్డూలను ఒక డబ్బాలో నింపుకుంటే దాదాపు రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి.ప్రసవం అనంతరం ప్రతి మహిళ ఈ లడ్డూలను ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడతారు.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వెయిట్ లాస్ అవుతారు.ఎముకలు దృఢంగా మారతాయి.వద‌లుగా మారిన కండరాలు బిగుతుగా అవుతాయి.మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube