ICC వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల.. భారత స్థానం ఇదే!

ICC (ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానంలో నిలవడం విశేషం.భారత జట్టు జింబాబ్వే వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

 Icc Oneday Rankings Released Indias Position Is This-TeluguStop.com

తద్వారా భారత జట్టు 111 రేటింగ్‌ పాయింట్లు సాధించి సత్తా చాటింది.అలాగే నెదర్లాండ్స్‌తో కూడా సిరీస్‌ను 3-0తో భారత్ దుమ్ముదులిపిన సంగతి విదితమే.

ఇక వెస్టిండీస్‌ను 2-1తో ఓడించిన న్యూజిలాండ్‌ జట్టు 124 రేటింగ్‌ పాయింట్లతో ICC వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానాన్ని కాపాడుకుంది.మరోవైపు.

ఇంగ్లండ్‌ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇకపోతే రెగ్యులర్‌ కెప్టెన్‌​ రోహిత్‌ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో KL రాహుల్‌ జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సారథ్యం వహించాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వరుసగా 10 వికెట్లు, 5 వికెట్లు, 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.ఈ మూడు మ్యాచ్‌లలో అద్బుతంగా రాణించిన బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

అలాగే పాకిస్తాన్‌ నెదర్లాండ్స్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసినా.ఆతిథ్య డచ్‌ జట్టు నుంచి మొదటి, ఆఖరి వన్డేల్లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది.

ఇక జింబాబ్వే, నెదర్లాండ్స్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా, పాకిస్తాన్‌ ఆసియా కప్‌-2022 టోర్నీకి రెడీ అయిపోతున్నాయి.ఆగష్టు 28న దుబాయ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ నేపథ్యంలో UAEకి వెళ్తున్నాయి.

టాప్‌-5 ICC మెన్స్‌ వన్డే జట్టు ర్యాంకింగ్స్‌:

1.న్యూజిలాండ్‌- రేటింగ్‌- 124


2.ఇంగ్లండ్‌- రేటింగ్‌- 119


3.ఇండియా- రేటింగ్‌- 111


4.పాకిస్తాన్‌- రేటింగ్‌- 107


5.ఆస్ట్రేలియా- రేటింగ్‌- 101

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube