మీరు IBomma యూజర్లయితే వీటిని చెక్ చేసుకోండి… జాగ్రత్త సుమా!

తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా iBomma అంటే ఏమిటో తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం సినిమా ధియేటర్ లకి ధీటుగా OTT ప్లాట్ ఫామ్స్ హవా పెరిగిపోతున్న సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 లాంటి నేషనల్ OTT ప్లాట్ ఫామ్స్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

 మీరు Ibomma యూజర్లయితే వీటిని చెక�-TeluguStop.com

ఇక అవి చాలవన్నట్టు ఆహా వంటి తెలుగు OTT ప్లాట్ ఫామ్స్ కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్స్ లో వచ్చే కంటెంట్ ని iBomma అనే ఒక వెబ్సైట్ ప్రేక్షకులకు ఫ్రీగా అందిస్తోంది.

వాస్తవానికి ఇది ఒక పైరసీ సైట్. కానీ చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ వెబ్సైట్స్ ని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు.

Telugu Ibomma, Ibomma Stops, Ibomma Website, Latest, Piracy, Piracy Sites-Latest

ఈ క్రమంలో ఈ వెబ్సైట్ మూసి వేస్తామని సదరు మేనేజ్మెంట్ చెప్పినప్పటికీ అది అమలు కాలేదు.అయితే ఇప్పుడు తాజాగా నిర్వాహకులు మరోసారి iBomma ప్రేక్షకులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ ఇండియాలో ఓపెన్ కావడం లేదు.అవును, సినీ ప్రేక్షకులను ఫ్రీగా అలరించే iBomma వెబ్సైట్ మళ్లీ ఆగిపోయింది.ప్రస్తుతం వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన దేశంలో సేవలు నిలిచిపోయినట్లు ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది.

Telugu Ibomma, Ibomma Stops, Ibomma Website, Latest, Piracy, Piracy Sites-Latest

ఇకపోతే iBommaలో వీడియోస్ చూడడం నేరమని నిపుణులు చెప్పినా జనాలు చూడడం మానలేదు.ఎందుకు మానుతారు.ఫ్రీగా ఇస్తే మనవాళ్ళకి ఏది అవసరం లేదు? కాగా ఇలా పైరసీ చేయడం వల్ల చాలామంది సినిమావాళ్ళకి నష్టం చేకూరుతుందని, సినిమాలను థియేటర్లలో చూడాలని ఎంతమంది చెప్పినా అది మూన్నాళ్ళ ముచ్చటే అయిపోతుంది.అయితే పైరసీ మనకి కొత్తేమి కాదు.మొదటినుండి సినిమా హాల్లోనే షూట్ చేసి పైరసీని రిలీజ్ చేసేవారు.అయితే ఇపుడు ఏకంగా HD వీడియోనే నెట్టింట్లో ప్రత్యక్షం అవడం ఒకింత బాధాకరమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube