యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్( Civil Services ) పరీక్షలో మంచి ర్యాంక్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం సులువు కాదు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన ఆదిత్య సింగ్( IAS Aditya Singh ) బీటెక్ చదివిన తర్వాత ఐబీఎంలో ఉద్యోగం సాధించారు.ఆ తర్వాత సివిల్స్ వైపు దృష్టి పెట్టి జాతీయ స్థాయిలో 92వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు.
యూపీలోని ముజఫర్ నగర్ కు చెందిన ఆదిత్య సింగ్ ఎంజీ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.
ముజఫర్ నగర్ లోనే( Muzaffarnagar ) ఇంటర్ పూర్తి చేసిన ఆదిత్య సింగ్ నోయిడాలోని జే.ఎస్.ఎస్ అకాడమీ నుంచి బీటెక్ పూర్తి చేసి ఐబీఎం బెంగళూరులో 18 నెలల పాటు జాబ్ చేశాడు.ఐబీఎంలో( IBM ) ఉద్యోగం చేస్తున్న సమయంలో యూపీఎస్సీ కోసం పోటీ పడాలనే కోరిక అతనిలో ఉండేది.జాబ్ చేస్తూనే యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయిన ఆదిత్య సింగ్ ఆ తర్వాత జాబ్ మానేసి నాలుగుసార్లు ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు.
ఐదో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 92వ ర్యాంక్ సాధించిన ఆదిత్య సింగ్ ఐఏఎస్( IAS ) కేడర్ ను సొంతం చేసుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.కుటుంబం నుంచి సపోర్ట్ లభించడం వల్లే అనుకున్న లక్ష్యాన్ని సాధించానని ఆదిత్య సింగ్ అన్నారు.చాలా సందర్భాల్లో నిరాశ ఎదురైనా తప్పకుండా ధ్యానం చేస్తూ డైరీ రాసే అలవాటు ద్వారా సులభంగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
ఆదిత్య సింగ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఆదిత్య సింగ్ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.ఆదిత్య సింగ్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆదిత్య సింగ్ ఐఏఎస్ గా ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.