రామ్ చరణ్ నటిస్తే తప్పకుండా ఆ సాంగ్ రీమిక్స్ చేస్తాను .... మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా యంగ్ హీరోలకు ఎంతో పోటీగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు.

 I Will Surely Remix That Song If Ram Charan Acts, Mahathi Swara Sagar, Mrugaraju-TeluguStop.com

ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు కూర్చున్న చిరంజీవి ఆగస్టు 11వ తేదీ భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

Telugu Indra, Mahathiswara, Mani Sharma, Mrugaraju, Radhe Govinda, Tollywood-Mov

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ( Mani Sharma ) కుమారుడు మహతి స్వర సాగర్( Mahathi Swara Sagar ) ఈ సినిమాకు సంగీతం అందించారు.ఈ సందర్భంగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం గురించి తన అనుభవాలను తెలియజేశారు.అదేవిధంగా తన తండ్రి మణిశర్మ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

మణిశర్మ గారి సంగీత సారథ్యంలో చిరంజీవి నటించిన సినిమాలలో తనకు ఇంద్ర( Indra ) మృగరాజు( Mrugaraju అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

Telugu Indra, Mahathiswara, Mani Sharma, Mrugaraju, Radhe Govinda, Tollywood-Mov

ఇంద్ర సినిమాని మ్యూజిక్ పరంగా మాత్రమే కాకుండా సినిమా పరంగా కూడా దాదాపు ఒక 500 సార్లు చూసి ఉంటానని తెలిపారు.ఇంద్ర సినిమా తర్వాత మృగరాజు సినిమా అంటే ఇష్టమని తెలిపారు.ఇక ఈ సినిమాలలో కనుక ఏదైనా పాటను రీమిక్స్ చేయాల్సి వస్తే తాను రాదే గోవిందా(Radhe Govinda) అనే పాటను తప్పనిసరిగా రీమిక్స్ చేస్తానని అది కూడా చరణ్ (Charan) చేస్తాను అంటే చరణ్ గారితోనే ఈ పాట రీమిక్స్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా మహతి స్వర సాగర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube