మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానుంది.ఈ క్రమంలోనే విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన, టీజర్స్ ,పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచారు.ఇకపోతే ఈనెల 23వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉండగా తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.ఆచార్య అంటే గురువు ఏదైనా మనకి కొత్త విషయాలు నేర్పే వాళ్లే మన ఆచార్యులుగా భావిస్తాము.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య ఎవరు అనే ప్రశ్న ఎదురవగా అందుకు చిరంజీవి సమాధానం చెబుతూ నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తూ ఉంటాను అంటూ సమాధానం చెప్పారు.అంటే మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానని ఈ సందర్భంగా వెల్లడించారు.

మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నక్సలిజం పాత్రలలో కనిపించనున్నారు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే సినిమాలు నటించడంతో ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.