సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.
అందులో ఫస్ట్ సాంగ్ కళావతి సాంగ్ రిలీజైంది.థమన్ మ్యూజిక్.
సిద్ శ్రీరాం గాత్రం కళావతి సాంగ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఎక్కడ చూసినా సరే కళావతి సాంగ్ వినిపిస్తుందంటే నమ్మాలి.
ఈ క్రమంలో మహేష్ సర్కారు వారి పాట నుండి రిలీజైన కళావతి సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ సాధించింది.అంతేకాదు 1.9 మిలియన్ లైక్స్ తో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
మహేష్, కీర్తి సురేష్ ల జోడీ సినిమాకు స్పెషల్ హైలెట్ అవుతుందని అంటున్నారు.
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పోకిరి మార్క్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.మే 12న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాతో తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు మహేష్.







