YS Sharmila : షర్మిలకు కడపలో భారీ షాక్ తప్పదా.. ఆ తప్పులే ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా?

కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా వైఎస్ షర్మిల( YS Sharmila ) పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.వైసీపీ తరపున అవినాష్ రెడ్డి( Avinash Reddy ) పోటీ చేస్తుండగా ఆయనను ఓడించాలనే ఆలోచనతో షర్మిల కడప( Kadapa ) నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

 Huge Shock To Sharmila In Kadapa Elections Details Here Goes Viral In Social Me-TeluguStop.com

కడప ఎంపీగా జగన్ మళ్లీ అవినాష్ రెడ్డికే తాజా జాబితాలో ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే సర్వేల ఫలితాలను బట్టి కడపలో వైసీపీకే అనుకూల ఫలితాలు రానున్నాయి.

వైఎస్ అవినాష్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు ఉన్నా ఆయనే ఎంపీగా విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.కాంగ్రెస్( Congress Party ) తరపున పోటీ చేయడమే షర్మిలకు శాపమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీకి కాంగ్రెస్ పార్టీ వల్ల కలిగిన నష్టం అంతాఇంతా కాదు.2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన 173 మంది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.షర్మిల ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉన్నా బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Congress, Ap, Cmjagan, Kadapa, Kadapa Mp, Sharmila Kadapa, Ycp, Ys Sha

కడప జిల్లా వైసీపీకి( YCP ) కంచుకోట అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.షర్మిల ఏపీలోనే వైఎస్సార్టీపీ మొదలుపెట్టి ఉంటే కనీసం ఏపీ ప్రజలలో కొంతమందైనా ఆమెకు అనుకూలంగా ఉండేవారు.తెలంగాణలో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ లేదని ఫిక్స్ అయ్యి అక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన షర్మిల ఆ తర్వాత వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

జగన్ రాజకీయ ప్రత్యర్థులకు అనుకూలంగా షర్మిల వ్యవహరిస్తున్నారు.

Telugu Ap Congress, Ap, Cmjagan, Kadapa, Kadapa Mp, Sharmila Kadapa, Ycp, Ys Sha

షర్మిల చేస్తున్న రాజకీయాలే ఆమె పాలిట శాపంగా మారనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.షర్మిలకు కడపలో పొలిటికల్ గా భారీ షాకులు తప్పవని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.విజయమ్మ మాత్రం ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు.

షర్మిల ఎన్నికల్లో ఓటమిపాలైతే ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలకు ఏ స్థాయిలో ఓట్లు వస్తాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube