శంకర్ మహదేవన్ మనస్సు దోచుకున్న హోటల్ మేనేజర్.. ఏం చేశాడో చూడండి

ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ ( Shankar Mahadevan )ఒక హోటల్ మేనేజర్ పాటకు ఫిదా అయిపోయారు.హోటల్ మేనేజర్ టాలెంట్ కు ఆశ్చర్యపోయారు.

 Hotel Manager Who Stole Shankar Mahadevan's Mind Look What He Did, Hotel Manager-TeluguStop.com

ఇటీవల హంగేరి పర్యటనకు శంకర్ మహదేవన్ వెళ్లారు.ఈ సందర్భంగా కార్నెల్ మగ్యార్( Cornell Magyar ) అనే హోటల్ కు వెళ్లారు.

అక్కడ హోటల్ మేనేజర్ శాస్త్రీయ సంగీత పాటలు పాడుతూ కనిపించాడు.అతడి పాటలు శంకర్ మహదేవన్‌కు బాగా నచ్చాయి.

అతడిని పిలిచి ఆరా తీయగా.తనకు శాస్త్రీయ సంగీతం అంటే బాగా ఇష్టమని, ప్రస్తుతం నేర్చుకుంటున్నానని చెప్పాడు.

శంకర్ మహదేవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హోటల్ మేనేజర్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.ఈ సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో ఊహించని, అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయని, ఎంతో లయ బద్దమైన సంగీతంతో హంగేరీలోని ( Hungary )ఒక హోటల్ మేనేజర్ అద్భుతంగా పాటలు పాడుతున్నట్లు రాసుకొచ్చారు.కార్నల్ మా హోటల్ మేనేజర్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.హోటల్ మేనేజర్‌కి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

మగ్యార్ బుడాపెస్ట్ లోని ఒక ఏరియా హోటల్ లో మగ్యార్ అనే ఈ హోటల్ మేనేజర్ పనిచేస్తున్నాడు.మ్యాగర్ మాట్లాడుతూ.తన సంగీతం నేర్పిన గురువైన ప్రొఫెసర్ ట్రిచ్చి శంకరన్ కే ( Professor Trichy Sankaran K )ఈ క్రెడిట్ దక్కుతుందని, ఆయన ప్రోత్సాహంతోనే పాటలు నేర్చుకున్నట్లు చెప్పాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడి పాటకు మెస్మరైజ్ అవుతున్నారు.భాషకు, సంగీతానికి సంబంధం లేదని ఇతడు నిరూపించాడని చెబుతున్నారు.హోటల్ మేనేజర్ కూాడా సింగర్‌లా పాటలు పాడుతున్నాడని అంటున్నారు.ఈయన టాలెంట్ అద్భుతమని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

శంకర్ మహదేవన్ షేర్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube