గోడ లోపల తేనేతుట్టు….వైరల్ అవుతున్న వీడియో  

Honey Bees In Side The Wall Video Goes Viral-honey Bees In Side The Wall,telugu Viral,viral In Social Media,viral ,గోడ లోపల తేనేతుట్టు,వైరల్ వీడియో

తేనెటీగలు అవి ఇచ్చే తేనే ఎంత తియ్యగా ఉంటుందో అవి చేసే సౌండ్ మాత్రం భరించలేం. ఎక్కడైనా తేనే తుట్టు అనేది ఏ చెట్టు కో, లేదంటే ఏదైనా అపార్ట్ మెంట్స్ లోనే పెడుతుండడం చూసే ఉంటాం. కానీ ఇంటిలోని గోడలో తేనే తుట్టు ఉంటుంది అని ఎవరైనా ఊహించగలరా..

గోడ లోపల తేనేతుట్టు....వైరల్ అవుతున్న వీడియో -Honey Bees In Side The Wall Video Goes Viral

కానీ స్పెయిన్ లో అదే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే….స్పెయిన్ లోని అండలూసియాలోని గ్రనాడ లోని ఒక ఇంటిలో గత రెండు సంవత్సరాలు గా జోరీగలా జుమ్ముకుంటూ వింత వింత సౌండ్స్ వచ్చేవి. అయితే ఆ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయో అర్ధం కాక ఆ ఇంట్లో మనుషులు విసిగిపోయారు.

రాను రాను ఆ సౌండ్ పెరిగిపోవడం తో ఒకరోజు గోడ పగలగొట్టి చూడడం తో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ గోడ లోపల వేళా సంఖ్య లో తేనే టీగలు కనిపించడం తో ఒక్కసారిగా కంగారు పది వెంటనే తేనెటీగలు పట్టుకొనే వ్యక్తికి ఫోన్ చేసి వాటిని బయటకు తీయించారు.

అయితే తేనెటీగల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల శబ్దాలు కూడా ఎక్కువయ్యాయని తేనెటీగలు పట్టుకునే వ్యక్తి తెలిపాడు. గోడ వెనకాల సుమారు 80 వేలకు పైగా తేనెటీగలు ఉన్నట్లు వాటిని పట్టుకున్న వ్యక్తి తెలిపాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.