తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమైన విశ్వక్ సేన్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.మాస్ ఎంటర్‌టైనర్ ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు మంచి ప్రయత్నం చేశాడు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.
ఇక నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూ్స్ చేసిన తాజా చిత్రం ‘హిట్’లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడని తెలుసుకుని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ సినిమాలో విశ్వక్ ఎలా నటిస్తాడా అని అందరూ అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వక్ నటించడంతో ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి.
ఇక సినిమా కథ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు.
పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించగా శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా 4 రోజులు పూర్తి చేసుకునే సరికి రెండు రాష్ట్రాల్లో రూ.3.89 కోట్లు కలెక్ట్ చేసింది.కాగా ఏరియాల వారీగా ఈ సినిమా వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 2.19 కోట్లు
సీడెడ్ – 0.31 కోట్లు
నెల్లూరు – 0.09 కోట్లు
కృష్ణా – 0.28 కోట్లు
గుంటూరు – 0.27 కోట్లు
వైజాగ్ – 0.40 కోట్లు
ఈస్ట్ – 0.17 కోట్లు
వెస్ట్ – 0.18 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 3.89 కోట్లు