చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్( Belt and Road Initiative ) గురించి మీరంతా వినే వుంటారు.ఇది ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది.
ఈ సమయంలో భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరినట్టు చాలా స్పస్టంగా కనబడుతోంది.అవును, దానికి వుదాహరణగా భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనమిక్ కారిడార్ కోసం అవగాహన పత్రంపై సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక ఆర్థిక సమైక్యతను ప్రోత్సహించడం ద్వారా ఆసియా, యూరోప్ దేశాలను అనుసంధానం చేయడమే దీని లక్ష్యంగా ఆయా దేశాలన్నీ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.చైనా స్పాన్సర్డ్ బీఆర్ఐ నుంచి జీ7 దేశాల్లో ఒకటైన ఇటలీ బయటకు వెళ్లిపోవాలని యోచిస్తోంది.మరోవైపు పాత మిత్రుడు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) చేతులు కలిపినట్టు కూడా భోగట్టా.వీరిద్దరి కలయిక వెనుక ప్రధాని మోదీ ప్రోత్సాహం ఎంతైనా ఉంది.
భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు ప్రమోటర్లలో యూఏఈ ప్రెసిడెంట్ ఒకరు.భారత్-యూరోప్ మధ్య ఆర్థిక రంగంలో వారథిగా అరేబియన్ ద్వీపకల్పం వ్యవహరించగలదని యూఏఈ విశ్వసిస్తోంది.
అదేవిధంగా ఎమ్మాన్యుయెల్ మేక్రన్( Emmanuel Macron ) మద్దతుతో జర్మనీ, ఇటలీ, యూరోపియన్ కమిషన్ కూడా ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలిపినట్టు తెలుస్తోంది.ఫుజైరా నౌకాశ్రయం-భారత దేశంలోని ముంద్రా నౌకాశ్రయాలను ఈస్ట్ కారిడార్ అనుసంధానం చేస్తుంది.సౌదీ అరేబియా, జోర్డాన్ గుండా రైలు మార్గాన్ని ఉపయోగించుకుని స్టాండర్టయిజ్డ్ కంటెయినర్ల ద్వారా ఇజ్రాయెలీ పోర్టు హైఫాకు సరుకును రవాణా చేయవచ్చనే ఆలోచనలు చేస్తోంది.వెస్ట్ కారిడార్ హైఫా నుంచి ప్రారంభమవుతుంది.
ఇక్కడి నుంచి భారత దేశంలోని సరుకులు వివిధ నౌకాశ్రయాలకు, ఫ్రాన్స్‌లోని మర్సీల్లే, ఇటలీ, గ్రీస్ దేశాల్లోని ఇతర నౌకాశ్రయాలకు రవాణా చేయవచ్చు.చైనా పడగ నీడ నుంచి మయన్మార్ సైనిక పాలకులు తప్పించుకుంటే, ఈ కారిడార్ వల్ల ప్రయోజనం పొందవచ్చని యోచిస్తోంది.