తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటీమణులలో రోజా కూడా ఒకరు.90 వ దశకం చివరి దశలో అలాగే 2000 దశకంలో కూడా ఆమె హీరోగా స్టార్ హీరోలందరి పక్కన నటించింది.దాదాపు దశబ్దం కి పైగా హీరోయిన్ గా ఉంటూ మంచి నటిగా తెలుగులో గుర్తింపు సంపాదించుకుంది.
ఇక హీరోయిన్ గా తన కెరీర్ కు గుడ్ బై చెప్పిన తర్వాత రోజా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కూడా నటించారు.
సినిమా ఇండస్ట్రీ విషయాలు కాసేపు పక్కన పెడితే తర్వాత రోజుల్లో జబర్దస్త్ కామెడీ షో కూడా ఆమె జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఘట్టమనే చెప్పాలి.ఈ షో ద్వారా ఆమె ఎనలేని గుర్తింపును కూడా తన సొంతం చేసుకున్నారు.
సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టి తన ఆస్తి మొత్తం కూడా పోగొట్టుకున్న సమయంలో జబర్దస్త్ కామెడీ షో తనని మళ్లీ తిరిగి నిలబెట్టింది.అప్పుల్లో ఉన్న తమ కుటుంబాన్ని గట్టున పడేలా చేసింది జబర్దస్త్ కామెడీ షో.ఎన్నో ఏళ్ల పాటు ఈ షోలో ఆమె జడ్జిగా వ్యవహరించారు.ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండి మొదట ఎమ్మెల్యే అయి, ఆ తర్వాత మంత్రిగా కూడా కొనసాగుతున్నారు రోజా.
పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ కి ఆమె గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు.

ఇక ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఆ తర్వాత జబర్దస్త్ జడ్జ్ గా తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చిన రోజా భారీగా ఆస్తులు కూడా పెట్టింది అనేది అప్పట్లో వినిపించిన మాట.నిజానికి అంత లేదు అనేది ఈ మధ్య తెలుస్తున్న వివరాల ప్రకారం కనిపిస్తుంది.రోజా ఆస్తులు విలువ దాదాపు కేవలం 7 కోట్ల 38 లక్షల రూపాయలు మాత్రమే అని, అలాగే స్థిరాస్తుల విలువ 4 కోట్ల 64 లక్షల రూపాయలని చరాస్తులు విలువ 2 కోట్ల 74 లక్షలు రోజా ఎన్నికల సమయంలో పేర్కొన్నారు.
ఇక తన పిల్లల పేరిట ఇద్దరికి చెరొక 50 లక్షల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది.అలాగే తన భర్త ఆయన సెల్వమని పేరుపై కేవలం 58 లక్షల వరకు మాత్రమే చరాస్తులు ఉన్నాయట.
చూడటానికి ఎంతో రిచ్ లైఫ్ అనుభవిస్తున్నట్టుగా ఉన్న రోజాకి ఇంత తక్కువ మొత్తంలోనే ఆస్తులు ఉన్నాయంటే ఆశ్చర్యానికి గురికాక తప్పదు.మరి ఇది నిజమైన ఆస్తుల చిట్టా నా? కాదా ? అనే విషయం తెలియదు కానీ రోజా ఆస్తులు చిట్టా విప్పిన తర్వాత నోరెళ్ళపెట్టడం అభిమానుల వంతయ్యింది.