సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఏ విధమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అలాంటి క్రేజ్ సంపాదించుకున్న హీరోలకు అదే స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు కూడా అభిమానులుగా మారితే ఎలా ఉంటుందో చెప్పండి.
ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్నప్పటికీ వారి కంటూ ప్రత్యేకమైన స్టార్ సెలబ్రెటీలు ఉంటారు.ఇలా స్టార్ సెలబ్రిటీలుగా ఉండడమే కాకుండా కొన్ని సినిమాలలో ఆ హీరోకి అభిమానిగా కనిపిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన థాంక్యూ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమానిగా కనిపిస్తారని తెలుస్తోంది.ఇంతకీ ఆ హీరో ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే.
అక్కినేని నాగచైతన్య థాంక్యూ సినిమాలో మహేష్ బాబుకి వీరాభిమానిగా కనిపిస్తారట.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలియజేయడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.
ఇప్పటికే ఇలా ఓ హీరో సినిమాలలో మరొక హీరోకి అభిమానులుగా నటించిన సందర్భాలు ఉన్నాయి.

గతంలో నాని బాలయ్య అభిమానిగా ఏకంగా తన చేతిపై జై బాలయ్య అని టాటూ వేయించుకొని మరి నటించిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా నాగచైతన్య సైతం మహేష్ బాబుకు అభిమానిగా కనిపించబోతున్నారని తెలియడంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు,నాగచైతన్య ఇద్దరు ఒకే జనరేషన్ హీరోలు అయినప్పటికీ ఇలా మహేష్ బాబు అభిమానిగా నాగచైతన్య కనిపించడం విశేషం.
థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీచర్స్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి.