నటుడు విక్రమ్( Hero Vikram ) గురించి మనందరికీ తెలిసిందే.కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు విక్రమ్.
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన అక్కపెత్తనం, చెల్లెలి కాపురం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఒక తెలుగు సినిమాలో హీరోగా నటించిన విడుదల కాలేదు.
దాంతో అప్పటి నుంచి మళ్లీ సహాయక పాత్రల్లో నటించారు.తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు.తమిళంలో సేతు ( Sethu movie ) తెలుగులో శేషు ( Seshu ) సినిమాలో సోలో హీరోగా నటించి హిట్ కొట్టాడు.
2003లో విడుదలైన పితామగన్(తెలుగులో శివపుత్రుడు) .సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ సినిమాతో ఉత్తమ జాతీయ నటుడు( Best Actor Award ) పురస్కరాన్ని కూడా అందుకున్నారు విక్రమ్.
సేతు సినిమా కోసం ఏకంగా 16 కిలోలు తగ్గిపోయారు.కాగా విక్రమ్ ని బాగా గమనిస్తే కుడి కాలు పై గీతలా ఉంటుంది.అది ఏంటో చాలా మందికి తెలియదు.దాని వెనుక పెద్ద కథే ఉంది.
అదేంటంటే చిన్నప్పటి నుండే నాటకాల పై మక్కువ పెంచుకున్న విక్రమ్ పలు స్టేజ్ షోల్లో పాల్గొన్నారు.సినిమాల వైపు రావాలనుకున్న విక్రమ్ కి యాక్సిడెంట్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.స్నేహితుడి తో కలిసి మోటారు బైక్ పై వెళుతుండగా కుడికాలుకు పెద్ద ప్రమాదం జరిగింది.విక్రమ్ ఎముకలు నలిగిపోయి, మోకాలి నుంచి చీలమండ వరకు చర్మం, మృదు కణజాలం దెబ్బతిన్నాయి.
ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు.
దీంతో ఆయనకు 23 ఆపరేషన్లు జరిగాయి.అలా విక్రమ్ కోలుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది.అప్పటికి పూర్తిగా కోలుకోలేదు.
ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో కూడా బాధపడ్డాడు.కానీ అవన్నీ ఆయనను బాధించలేదు.నటుడిని కావాలన్న తన కోరిక ముందు, విక్రమ్ ని అవన్నీ చిన్నగా అనిపించాయి.1990లో ఓ చిన్న బడ్జెట్ మూవీ ద్వారా తన కలను నెరవేర్చుకున్నారు.అలా తన వద్దకు వచ్చిన అవకాశాలను విడిచిపెట్టకుండా చిన్న హీరో నుండి స్టార్ స్థాయికి చేరాడు.కాగా ప్రస్తుతం విక్రమ్ వయసు 56 ఏళ్లు.