బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez )ఢిల్లీ సీబీఐ కోర్టుకు హాజరైయ్యారు.రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్( Sukesh Chandrasekhar ) తో సంబంధాల నేపథ్యంలో జాక్వెలిన్ పై కేసు నమోదు అయింది.
ఈ క్రమంలో రేపు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్( FSL ) నివేదిక దాఖలు చేయాలని న్యాయస్థానం ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.