ఏంటో ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు ఏ విషయాలు ఉన్నా కూడా దాచేయ్యకుండా వెంటనే లీక్ చేసేస్తూ ఉన్నారు.ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నా, గర్భం దాల్చిన, పెళ్లి చేసుకోబోతున్న విషయాలు ఏమాత్రం దాపెట్టకుండా చెప్పేస్తున్నారు.
కొంతమంది హీరోయిన్లు ఇలా డేర్ చేయలేరు.కానీ మరి కొంతమంది బరితెగించినట్లు అనిపిస్తూ ఉంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా హెబ్బా పటేల్ లవర్ అంటూ ఒక వ్యక్తి ఫోటో షేర్ చేసుకుని షాక్ ఇచ్చింది.ఇంతకు అసలు విషయం ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్( Hebah Patel) ఒక చిన్న హీరోయిన్ గా మాత్రమే మిగిలిపోయింది.తొలిసారిగా 2014లో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.
టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్( Kumari 21F) తో పరిచయం అయింది.ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంతగా మెప్పించలేకపోయింది.
ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.
దీంతో అవకాశాల కోసం బాగా ఆరాట పడుతుంది.పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.
చూడ్డానికి అంత అందగత్తె కాకపోయినా కూడా.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.
మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది.

సినిమాలలో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా( Social media) ద్వారా టచ్ లో ఉంటుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
కానీ వాటిని పట్టించుకోకుండా అవకాశాల కోసం తన పని తాను చేసుకుంటూ పోతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక అయినా కూడా ఈమెను అంతగా పట్టించుకునే జనాలు అయితే లేరు.ఏదో పేరుకు మాత్రమే హీరోయిన్ కానీ.చాలావరకు ట్రోల్స్ కే గురవుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఇంస్టాగ్రామ్( Instagram) లో లవర్ అంటూ ఒక వ్యక్తి ఫోటో పంచుకుంది.
ఇక అతడిని హగ్ చేసుకోగా అతని మొఖం కనిపించకుండా కవర్ చేసింది.

ఆ ఫోటో చూసిన వాళ్లంతా ఆమె అంత డేర్ చేయడంతో షాక్ అయ్యారు.పైగా మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే అతడు నిజంగా లవరా లేక సరదాగా అలా పెట్టిందో తెలియదు కానీ.
గతంలో కూడా ట్రెడిషనల్ గా రెడీ అయి తన పెళ్లికూతురు ఫంక్షన్ కు స్వాగతం చెప్పింది.ఇదంతా చూస్తుంటే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవడానికి హింట్ ఇస్తుందేమో అని అనుమానం పడుతున్నారు.