స్మార్ట్ మొక్కల కుండీ గురించి విన్నారా? స్మార్ట్‌ఫోన్‌తో పనిచేస్తుంది చూడండి!

ఈ స్మార్ట్ యుగంలో అంతా స్మార్ట్ గానే కనిపిస్తోంది… లేకపోతే స్మార్ట్ మొక్కల కుండీ ఏమిటి, పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.ఇపుడు మార్కెట్లో స్మార్ట్ మొక్కల కుండీలు వచ్చేసాయి.

 Heard Of Smart Plant Pots See Works With Smartphone ,samrt Plants, Viral Lates-TeluguStop.com

అవును, ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ఆ హైటెక్‌ మొక్కల కుండీనే.ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

ఇందులో ఒకేసారి ఇరవై ఒక్క రకాల మొక్కలను పెంచుకునే వీలుంది.ఇందులోని నాటిన మొక్కలకు ఈ కుండీ తానే స్వయంగా కావలసిన నీరు, పోషకాలు అందిస్తుంది.

వినడానికి విడ్డురంగా వున్నా ఇది నిజమే.సూర్యకాంతి అవసరమైన సమయంలో దీనిపైన ఉన్న రూఫ్‌లో అమర్చిన LED లైట్లు వెలుగుతాయి.

అయితే ఇందులో పెరిగే మొక్కలకు ఎలాంటి మట్టి అవసరం లేదు.మట్టి, బురద బెడద లేకుండానే ఇందులో వేసిన మొక్కలు వాటంతట అవే పెరిగిపోతాయి.

ఈ కుండీలను తయారుచేసే బహుళజాతి సంస్థ ‘లెట్‌పాట్‌’ ఈ కుండీని ‘ఎల్‌పీహెచ్‌–మ్యాక్స్‌’ పేరుతో అందుబాటులోకి మార్కెట్లో రిలీజు చేసింది.

Telugu Pot, Latest, Pots, Samrt, Smart Pot, Ups-Latest News - Telugu

ఇక్కడ మనకి కావలసిందల్లా ఒక్కటే అదే స్మార్ట్‌ఫోన్‌.అవును, చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్‌ ఉంటే, బ్లూటూత్‌ ద్వారా ఇందులోని మొక్కల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం మనకి ఉంటుంది.ఇది ‘స్మార్ట్‌ హైడ్రోపోనిక్‌ ప్లాంట్‌ కల్టివేటర్‌’.

మనుషుల ప్రమేయం అవసరం లేకుండానే ఇది పని చేయడం కొసమెరుపు.దీని ట్యాంకును నీటితో నింపి, ఫ్రిజ్‌ మాదిరిగా ప్లగ్‌ పెట్టి, ఆన్‌ చేసుకుంటే చాలు.

ఇకపోతే ఇందులో ఆకుకూరలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలను కూడా పెంచుకోవచ్చని భోగట్టా.కాగా దీని ధర 329 డాలర్లు (సుమారు రూ.27 వేలు) మాత్రమే!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube