గులాబీ అందానికే కాదు ఆరోగ్యానికి కూడా....ఎలా?

అందానికి గులాబీ ఒక నిర్వచనములాగా ఉంటుంది.గులాబీ ఉంటే ఆ ప్రదేశానికి అందం వస్తుంది.

 Health Benefits Of Rose Flower-TeluguStop.com

గులాబీ అందానికే కాదు ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది.గులాబీలో ఆరోగ్యానికి సహాయపడే సుగుణాలు చాలా ఉన్నాయి.

ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

గులాబీ రేకల్లో ఉండే ప్రత్యేక లక్షణాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.

శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయం చేస్తాయి.తద్వారా బరువు తగ్గుతాం.

గులాబీ రేకులను శుభ్రంగా కడిగి తినవచ్చు.లేదా గులాబీ రేకులను గ్లాస్ వేడినీటిలో వేసి అవి రంగు మారాక ఆ నీటిని వడగట్టాలి.

వడగట్టిన నీటిలో ఒక స్పూన్ తేనే,చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపి పరగడుపున త్రాగాలి.

అలసట,ఒత్తిడి సమస్యల పరిష్కారానికి గులాబీ రేకులు బాగా సహాయపడతాయి.

ఒత్తిడిగా ఉన్నప్పుడు వేడినీటిలో గుప్పెడు గులాబీ రేకలు వేసుకొని స్నానం చేస్తే మెదడు,శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది.

అంతేకాక గులాబీ రేకులతో టీ తయారుచేసుకోవచ్చు.

వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,విటమిన్ సి శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి.అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube